breaking news
thuntari
-
'తుంటరి' మూవీ రివ్యూ
టైటిల్ : తుంటరి జానర్ : కామెడీ యాక్షన్ డ్రామా తారాగణం : నారా రోహిత్, లతా హెగ్డే, కబీర్ దుహన్ సింగ్, వెన్నెల కిశోర్ సంగీతం : సాయి కార్తీక్ దర్శకత్వం : కుమార్ నాగేంద్ర నిర్మాత : శ్రీ కీర్తీ ఫిలింస్ కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యభరిత సినిమాలు చేస్తున్న నారా రోహిత్ తొలిసారిగా తుంటరి పేరుతో ఓ మాస్ కమర్షియల్ సినిమాను, అది కూడా ఓ రీమేక్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. గుండెల్లో గోదారి, జోరు లాంటి సినిమాలతో ఆకట్టుకున్నా, సక్సెస్ సాధించలేకపోయిన దర్శకుడు కుమార్ నాగేంద్ర ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ సాధించాలని భావిస్తున్నాడు. తమిళంలో స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కథతో మాన్ కరాటే పేరుతో తెరకెక్కి ఘనవిజయం సాధించిన సినిమాకు రీమేక్‌గా సినిమాను తెరకెక్కించారు. తుంటరిగా ఆడియన్స్ ముందుకు వచ్చిన నారా రోహిత్ కమర్షియల్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడా..? కుమార్ నాగేంద్ర తుంటరితో సక్సెస్ సాధించాడా...? కథ : కిశోర్, ఆనంద్, సుదర్శన్, కల్కి, పూజిత ఐదుగురు స్నేహితులు, సత్వం సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేసే ఈ ఐదుగురు ఫ్రెండ్స్ అనంతగిరి ఫారెస్ట్‌కు పిక్నిక్ వెళతారు. అక్కడ ఓ సాధువును కలిసిన వీళ్లకు భవిష్యత్తు గురించి ఓ విషయం తెలుస్తుంది. నాలుగు నెలల తరువాత జరగబోయే ఓ బాక్సింగ్ మ్యాచ్‌లో రాజు అనే వ్యక్తి గెలుస్తాడు. ఆ రాజు బిఎస్ఎన్ఎల్లో పనిచేసే ఆనందరావు గారి అబ్బాయి అని తెలుస్తుంది. దీంతో బాక్సింగ్ మ్యాచ్ విన్నర్‌కి ఇచ్చే ఐదు కోట్ల ప్రైజ్ మనీ కోసం ఎలాగైన ఆ రాజును వెతికి పట్టుకోవాలనుకుంటారు. అదే సమయంలో చిన్నప్పటి నుంచి చదువు, పని లేకుండా గాలికి తిరిగే లోకల్ రాజు( నారా రోహిత్) ను కిశోర్ బ్యాచ్ పట్టుకుంటారు. రాజు తండ్రి ఆనందరావు (కాశీ విశ్వనాథ్) బిఎస్ఎన్ఎల్ ఆఫీస్‌లో పని చేస్తుంటాడు. దీంతో తమకు కావాల్సిన రాజు ఇతనే అని ఫిక్స్ అయిన కిశోర్ అండ్ గ్యాంగ్ రాజుతో డీల్ మాట్లాడతారు. నెల నెల జీతంలో పాటు తన బాక్సింగ్ ప్రాక్టీస్‌కు కావాల్సిన ఖర్చులన్ని తామే బరిస్తామని రాజును ఒప్పిస్తారు. అదే సమయంలో సిరి (లతా హెగ్డే)తో ప్రేమలో పడతాడు రాజు. బాక్సింగ్ ప్రాక్టీస్ చేయకుండా సిరి వెంట పడుతూ ఆమె ప్రేమను గెలుచుకుంటాడు. బాక్సింగ్ ప్రాక్టీస్ సమయంలో కిశోర్ బ్యాచ్‌కు పెద్ద షాక్ తలుగుతుంది. ఇప్పటికే చాలా సార్లు చాంపియన్ షిప్ సాధించిన టాప్ బాక్సర్ పేరు కూడా రాజు(కబీర్ దుహన్ సింగ్) అని, అతని తండ్రి పేరు కూడా ఆనందరావు అని, అతను కూడా బిఎస్ఎన్ఎల్లోనే ఉద్యోగం చేస్తున్నాడని తెలుస్తుంది. దీంతో ఈ సారి టోర్నమెంట్లో గెలవబోయేది ఆ రాజేనేమో అన్న అనుమానం కలుగుతుంది. మరి చివరకు టోర్నమెంట్లో ఏ రాజు గెలిచాడు..? లోకల్ రాజు బాక్సర్ కాదని తెలిసిన సిరి అతడి ప్రేమను అంగీకరించిందా..? అసలు కిశోర్ ఫ్రెండ్స్‌కు తెలిసిన భవిష్యత్తు నిజమేనా..? అన్నది తెర మీద చూసి తెలుసుకోవాల్సిందే. నటీనటులు : ఇప్పటి వరకు డీసెంట్ పాత్రల్లోనే మెప్పించిన నారా రోహిత్ తొలిసారిగా లోకల్ రాజు పాత్రలో మాస్ క్యారెక్టర్‌ను ట్రై చేశాడు. ముఖ్యంగా కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్న రోహిత్, తనకు బాగా పట్టున్న ఎమోషనల్ సీన్స్‌లోనూ మెప్పించాడు. డ్రెస్సింగ్, బాడీ లాంగ్వేజ్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకొని కొత్తగా కనిపించే ప్రయత్నం చేశాడు. కాస్త బొద్దుగా కనిపిస్తున్న రోహిత్ లుక్, లవ్ సీన్స్‌లో కాస్త ఇబ్బంది పెట్టినా, బాక్సర్‌గా మాత్రం బాగా సరిపోయింది. హీరోయిన్గా పరిచయం అయిన లతా హెగ్డే ఉన్నంతలో మెప్పించింది. గ్లామర్‌తో పాటు క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లోనూ మంచి నటన కనబరిచింది. రాజును ఎలాగైనా బాక్సింగ్ మ్యాచ్ గెలిపించాలని ఫిక్స్ అయిన ఫ్రెండ్స్‌గా వెన్నెల కిశోర్, ఆనంద్, సుదర్శన్, కల్కి, పూజితాలు తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు. కబీర్ దుహన్ సింగ్ విలన్ పాత్రకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. హీరో ఫ్రెండ్‌గా షకలక శంకర్ కామెడీ బాగుంది. బాక్సింగ్ రిఫరీగా ఆలీ కామెడీ బాగుంది. సాంకేతిక నిపుణులు : తమిళ సినిమాకు రీమేక్ అయినా.. ఎక్కడా ఆ ఛాయలు లేకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు కుమార్ నాగేంద్ర. ముఖ్యంగా క్రీడా నేపథ్యం ఉన్న కథ కావటంతో నేటివిటి సమస్య పెద్దగా కనిపించలేదు. హీరో క్యారెక్టరైజేషన్లో కొత్తదనంతో ఆకట్టుకున్నాడు. రోహిత్లోని కామెడీ యాంగిల్‌ను ఆడియన్స్‌కు పరిచయం చేయటంలో మంచి విజయం సాధించాడు. ఒరిజినల్ సినిమాలా రెండున్నర గంటల పాటు సినిమాను సాగదీయకుండా, రెండు గంటలకు తగ్గించి దర్శకుడు మంచి నిర్ణయం తీసుకున్నాడు. సాయి కార్తీక్ సంగీతం బాగుంది. పాటలతో పర్వాలేదనిపించిన కార్తీక్ నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. ప్రతీసీన్ను తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో మరింత ఎలివేట్ చేశాడు. పలనీ కుమార్ సినిమాటోగ్రఫి, మధు ఎడిటింగ్ బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : నేపథ్య సంగీతం నారా రోహిత్ కామెడీ టైమింగ్ స్టోరీ స్క్రీన్ ప్లే మైనస్ పాయింట్స్ : డైలాగ్స్ ఓవరల్‌గా 'తుంటరి' నారా రోహిత్లోని మాస్ యాంగిల్ ను పరిచయం చేసే కామెడీ ఎంటర్టైనర్ - సతీష్ రెడ్డి, ఇంటర్ నెట్ డెస్క్ -
నారా రోహిత్ 'తుంటరి' ఫస్ట్‌లుక్ టీజర్
ప్రతినిథి, రౌడిఫెలో, అసుర సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్‌హీరో నారా రోహిత్ మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. తమిళంలో ఘనవిజయం సాధించిన 'మాన్ కరాటే' సినిమాను తుంటరి పేరుతో రీమేక్ చేస్తున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కథ అందించిన ఈ సినిమా రోహిత్ కెరీర్‌కు మంచి బ్రేక్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలో బిజీగా ఉంది. ఫిబ్రవరి చివర్లో ఆడియోను, మార్చిలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఇందులో భాగంగా తుంటరీ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయ్యింది. పూర్తి యాక్షన్ సీన్స్‌తో రిలీజ్ అయిన ఈ ట్రైలర్లో హీరోతో పాటు విలన్ పాత్రలో నటించిన కబీర్ దుహన్ సింగ్‌ను కూడా రివీల్ చేశారు. తన సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చకున్న రోహిత్, తుంటరిగా అయిన స్టార్ ఇమేజ్ అందుకుంటాడేమో చూడాలి. -
నారా రోహిత్ 'తుంటరి' ఫస్ట్‌లుక్ టీజర్
-
'తుంటరి'గా రౌడీఫెలో
ప్రతినిథి, రౌడీఫెలో, అసుర లాంటి వరుస హిట్స్ తో మంచి ఫాంలో ఉన్న నారా రోహిత్ మరో ఇంట్రస్టింగ్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం రోహిత్ గుండెల్లో గోదారి ఫేం కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తమిళ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కథ అందిస్తున్నాడు. షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు తుంటరి అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు చిత్రయూనిట్. శ్రీ కీర్తి ఫిలిమ్స్ బ్యానర్‌పై రెండో ప్రయత్నంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో న్యూ లుక్‌లో దర్శనమివ్వనున్నాడు నారా రోహిత్. త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దసరా సందర్బంగా రిలీజ్ చేశారు. డెస్టినీ వర్సెస్ హార్డ్ వర్క్ అనే స్టేట్మెంట్తో నారారోహిత్ ట్రెండీ లుక్‌తో డిజైన్ చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటుంది.