నారా రోహిత్ 'తుంటరి' ఫస్ట్లుక్ టీజర్ | nara rohith thuntari first look teaser | Sakshi
Sakshi News home page

నారా రోహిత్ 'తుంటరి' ఫస్ట్లుక్ టీజర్

Jan 29 2016 12:16 PM | Updated on Sep 3 2017 4:34 PM

నారా రోహిత్ 'తుంటరి' ఫస్ట్లుక్ టీజర్

నారా రోహిత్ 'తుంటరి' ఫస్ట్లుక్ టీజర్

ప్రతినిథి, రౌడిఫెలో, అసుర సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్హీరో నారా రోహిత్ మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. తమిళంలో ఘనవిజయం...

ప్రతినిథి, రౌడిఫెలో, అసుర సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్హీరో నారా రోహిత్ మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. తమిళంలో ఘనవిజయం సాధించిన 'మాన్ కరాటే' సినిమాను తుంటరి పేరుతో రీమేక్ చేస్తున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కథ అందించిన ఈ సినిమా రోహిత్ కెరీర్కు మంచి బ్రేక్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలో బిజీగా ఉంది. ఫిబ్రవరి చివర్లో ఆడియోను, మార్చిలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఇందులో భాగంగా తుంటరీ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయ్యింది. పూర్తి యాక్షన్ సీన్స్తో రిలీజ్ అయిన ఈ ట్రైలర్లో హీరోతో పాటు విలన్ పాత్రలో నటించిన కబీర్ దుహన్ సింగ్ను కూడా రివీల్ చేశారు. తన సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చకున్న రోహిత్, తుంటరిగా అయిన స్టార్ ఇమేజ్ అందుకుంటాడేమో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement