హిందీ సినిమా చూసిన నాగార్జున, అమల | Nagarjuna saw 'Hamari Adhuri Kahani' with wife on anniversary | Sakshi
Sakshi News home page

హిందీ సినిమా చూసిన నాగార్జున, అమల

Jun 12 2015 5:53 PM | Updated on Jul 21 2019 4:48 PM

హిందీ సినిమా చూసిన నాగార్జున, అమల - Sakshi

హిందీ సినిమా చూసిన నాగార్జున, అమల

తాను ప్రత్యేక పాత్రలో నటించిన 'హమారీ ఆధూరీ కహానీ' హిందీ సినిమాను తన భర్త అక్కినేని నాగార్జునతో కలిసి అమల గురువారం వీక్షించారు.

హైదరాబాద్: తాను ప్రత్యేక పాత్రలో నటించిన 'హమారీ ఆధూరీ కహానీ' హిందీ సినిమాను తన భర్త అక్కినేని నాగార్జునతో కలిసి అక్కినేని అమల గురువారం వీక్షించారు. గురువారం వీరి పెళ్లిరోజు కూడా కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమా చూశారు. ఇమ్రాన్ హష్మీ, విద్యాబాలన్, రాజకుమార్ రావ్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాలో అమల కీలకపాత్ర పోషించారు. ఆమె కోసం హైదరాబాద్ లో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించినట్టు చిత్రవర్గాలు వెల్లడించాయి. అమల నటనను నాగార్జున ఎంతో మెచ్చుకున్నారని తెలిపాయి.

ఈ సినిమాలో ఇమ్రాన్ షహ్మీ తల్లిగా అమల నటించారు. తన సినిమాను నాగార్జున, అమల దంపతులు మెచ్చుకున్నారని దర్శకుడు మొహిత్ సూరి తెలిపారు. వారి ప్రశంస తనకు పెద్ద కాంప్లిమెంట్ అని పేర్కొన్నారు. 'హమారీ ఆధూరీ కహానీ'  శుక్రవారం విడుదలైంది.

Advertisement
 
Advertisement
Advertisement