దిల్రాజు బ్యానర్లో నాగ్..? | Nagarjuna next movie with dilraju | Sakshi
Sakshi News home page

దిల్రాజు బ్యానర్లో నాగ్..?

Jan 22 2016 8:51 AM | Updated on Jul 15 2019 9:21 PM

దిల్రాజు బ్యానర్లో నాగ్..? - Sakshi

దిల్రాజు బ్యానర్లో నాగ్..?

సంక్రాంతి బరిలో సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కింగ్ నాగార్జున. వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు.

సంక్రాంతి బరిలో 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కింగ్ నాగార్జున. వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఈ సక్సెస్ తరువాత కొంత గ్యాప్ తీసుకోవాలని భావించిన వరుస ఆఫర్లు వస్తుండటంతో గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేయడానికే రెడీ అవుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఓ చారిత్రక చిత్రానికి రెడీ అవుతున్న నాగ్ మరో కమర్షియల్ ఎంటర్టైనర్ మీద కూడా దృష్టి పెట్టాడు.

స్టార్ ప్రొడ్యూసర్ దిల్రాజు రవితేజ హీరోగా ఓ సినిమాను ప్రారంభిచాడు. ఓ మై ఫ్రెండ్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వేణు శ్రీరాం ఈ సినిమాకు దర్శకుడు. లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా, తరువాత కథ విషయంలో దిల్రాజు, రవితేజలకు అభిప్రాయ బేధం రావటంతో ఆగిపోయింది. దీంతో ఇప్పుడు అదే సినిమాను కొద్ది పాటి మార్పులతో నాగార్జున హీరోగా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు దిల్రాజు. మరి రవితేజ కాదన్న కథను నాగ్ అంగీకరిస్తాడో లేదో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement