ప్రేయసి చెంతకు చేరాడా? | Mariyaan Audio Released | Sakshi
Sakshi News home page

ప్రేయసి చెంతకు చేరాడా?

Apr 26 2015 10:57 PM | Updated on Sep 3 2017 12:56 AM

ప్రేయసి చెంతకు చేరాడా?

ప్రేయసి చెంతకు చేరాడా?

‘రఘువరన్ బీటెక్’, ‘అనేకుడు’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో ధనుష్ ఈసారి

‘రఘువరన్ బీటెక్’, ‘అనేకుడు’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో ధనుష్ ఈసారి ‘మరియన్’గా రానున్నారు. ధనుష్, పార్వతీ మీనన్ జంటగా భరత్‌బాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎస్వీఆర్ మీడియా అధినేత శోభారాణి తెలుగులోకి అనువదించారు. ఏఆర్ రహ్మాన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పాటలను, ప్రచార చిత్రాలను నిర్మాత కె. అచ్చిరెడ్డి ఆవిష్కరించారు.
 
  ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ -‘‘నిజజీవిత సంఘటనల ఆధారంగా భరత్ బాల ఈ చిత్రం రూపొందించారు. కడలికే రారాజునని భావించే ఓ యువకుడు అనుకోకుండా ఉగ్రవాదుల చేతుల్లో బందీ అవుతాడు. వారి నుంచి ఎలా తప్పించుకుని తన ప్రియురాలిని చేరుకున్నాడు? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. తమిళంలో మంచి మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. తెలుగులోనూ ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ఈ వేడుకలో ఆర్.పి. పట్నాయక్, మల్టీ డెమైన్షన్ వాసు, రవి, ప్రిన్స్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement