మహేష్కి రికార్డ్ మిస్ అయ్యింది | Mahesh babu brahmostavam collections | Sakshi
Sakshi News home page

మహేష్కి రికార్డ్ మిస్ అయ్యింది

May 22 2016 9:03 AM | Updated on Mar 22 2019 5:33 PM

మహేష్కి రికార్డ్ మిస్ అయ్యింది - Sakshi

మహేష్కి రికార్డ్ మిస్ అయ్యింది

సర్థార్ గబ్బర్సింగ్ 29 కోట్లతో ఆల్ టైం రికార్డ్ సెట్ చేస్తే, మహేష్ మాత్రం 18 కోట్లతో సరిపెట్టుకున్నాడు.

ఈ సమ్మర్ బరిలో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా బ్రహ్మోత్సవం. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కుటుంబ కథా చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో పీవీపీ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం తెలుగు నాట అన్ని రికార్డులు తిరగరాస్తుందని భావించారు. ఇక నాన్ బాహుబలి రికార్డులన్ని మహేష్ సొంతం కావటం ఖాయం అన్న టాక్ వినిపించింది. అందుకు తగ్గట్టుగానే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డ్ స్థాయిలో జరిగింది.

అయితే అనుకున్నట్టుగా మహేష్ రికార్డ్లు తిరగరాయలేదన్న టాక్ వినిపిస్తోంది. ఇతర హీరోల రికార్డులనే కాదు, తన పాత రికార్డులను కూడా బ్రేక్ చేయలేకపోయాడు. తొలి రోజు కలెక్షన్ల విషయంలో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ సర్థార్ గబ్బర్సింగ్ నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ బ్రేక్ చేయగా, ఆ రికార్డ్లను బ్రహ్మోత్సవంతో మహేష్ తిరగరాస్తాడని ఆశించిన ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. మహేష్, సర్థార్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాడు. సర్థార్ గబ్బర్సింగ్ 29 కోట్లతో ఆల్ టైం రికార్డ్ సెట్ చేస్తే, మహేష్ మాత్రం 18 కోట్లతో సరిపెట్టుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement