లచ్చిందేవి లెక్కేంటి? | Lachhimideviki O Lekkundi reday for Release | Sakshi
Sakshi News home page

లచ్చిందేవి లెక్కేంటి?

Dec 11 2015 1:33 AM | Updated on Sep 3 2017 1:47 PM

లచ్చిందేవి లెక్కేంటి?

లచ్చిందేవి లెక్కేంటి?

లక్ష్మీదేవిని పూజించని వారు ఎవరూ ఉండరు. నిరుపేదల నుంచి కోటీశ్వరుల వరకూ అందరూ అనుగ్రహం

లక్ష్మీదేవిని పూజించని వారు ఎవరూ ఉండరు. నిరుపేదల నుంచి కోటీశ్వరుల వరకూ అందరూ అనుగ్రహం కోసం ఆమెను పూజించేవారే. అయితే లచ్చిందేవికి కూడా ఎప్పుడు, ఎవరిని అనుగ్రహించాలో ఓ లెక్క ఉంటుంది. ఈ నేపథ్యంలో రూపొందిన సినిమా ‘లచ్చిందేవికీ ఓ లెక్కుంది’. జగదీశ్ తలశిల దర్శకత్వంలో సాయిప్రసాద్ కామినేని నిర్మించిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న విడుదల చేస్తున్నారు. నవీన్‌చంద్ర, లావణ్యా త్రిపాఠీ జంటగా నటించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘కీరవాణి సంగీతం హైలైట్. ఉత్కంఠ భరితమైన ఈ సినిమాలో అన్ని కమర్షియల్ అంశాలూ ఉన్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఈ. మధుసూదన్‌రావు.
 

Advertisement
 
Advertisement
Advertisement