'కో' కాంబినేషన్లో మరో సినిమా | kv anand next project with jeeva | Sakshi
Sakshi News home page

'కో' కాంబినేషన్లో మరో సినిమా

Nov 4 2015 11:45 AM | Updated on Sep 3 2017 12:00 PM

2011లో జీవా హీరోగా తెరకెక్కిన 'కో' అప్పట్లో సంఛలన విజయం సాధించింది. తరువాత ఆ సినిమా 'రంగం' పేరుతో తెలుగులోకి అనువాదమై ఇక్కడ కూడా అదే స్ధాయిలో విజయం సాధిచింది. కార్తీక హీరోయిన్...

2011లో జీవా హీరోగా తెరకెక్కిన 'కో' అప్పట్లో సంచలనం విజయం సాధించింది. తరువాత ఆ సినిమా 'రంగం' పేరుతో తెలుగులోకి అనువాదమై ఇక్కడ కూడా అదే స్ధాయిలో విజయం సాధిచింది. కార్తీక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కెవి ఆనంద్ దర్శకుడు. ఈ సినిమా విడుదలైన నాలుగేళ్ల తరువాత అదే కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే కెవి ఆనంద్ దర్శకత్వంలో జీవా హీరోగా మరో సినిమాకు రెడీ అవుతున్నారు.

ధనుష్ హీరోగా తెరకెక్కిన అనేగన్ సినిమా తరువాత ఇంతవరకు నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయని కెవి ఆనంద్ త్వరలోనే కొత్త సినిమా మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడు. అజిత్, శివకార్తీకేయన్, ఆర్య లాంటి హీరోలతో ఆనంద్ సినిమా ఉంటుందన్న టాక్ వినిపించినా ఫైనల్గా జీవాతోనే సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు కెవి ఆనంద్.

Advertisement
 
Advertisement
Advertisement