‘కొట్టేయడంతో పాటు కొట్టడమూ వచ్చురా’ | Kusa teaser released from ntr latest movie | Sakshi
Sakshi News home page

‘కొట్టేయడంతో పాటు కొట్టడమూ వచ్చురా’

Sep 8 2017 11:59 AM | Updated on Sep 17 2017 6:36 PM

‘కొట్టేయడంతో పాటు కొట్టడమూ వచ్చురా’

‘కొట్టేయడంతో పాటు కొట్టడమూ వచ్చురా’

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 'జై లవ కుశ'.

సాక్షి, హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 'జై లవ కుశ'. ఇటీవల వినాయక చవితి కానుకగా లవ కుమార్ ను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్, ఫస్ట్ రిలీజ్ చేసిన జై టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీలో మూడోపాత్ర కుశ టీజర్ ను మూవీ యూనిట్‌ రిలీజ్ చేసింది. కుశ పాత్రలో ఎన్టీఆర్ మాస్ లుక్‌లో అభిమానుల అంచనాలు అందుకునేలా కనిపిస్తున్నారు.

42 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో 'కొట్టేయడంతో పాటు కొట్టడం కూడా వచ్చురా' అంటూ ఎన్టీఆర్ ఎంతో ఉద్వేగంతో చెప్పిన డైలాగ్ ఆ పాత్రపై ఆసక్తిని పెంచుతోంది. దాన్ని ఆధార్ కార్డ్ అనరమ్మ.. గ్రీన్ కార్డ్ అంటారని ఎన్టీఆర్ కు అతని ఫ్రెండ్స్ చెప్పడం ఎంతో ఫన్నీగా ఉంది. పవర్, సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాల తీసిన బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హీరో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ డైరెక్టర్. 'జై లవ కుశ' చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్‌ 21న విడుదలకు సిద్ధంగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement