తప్పు ఒప్పుకున్న నటుడు.. ప్రశంసలు!

Kunal Kemmu Accepts His Mistake On Social Media - Sakshi

సాక్షి, ముంబై: సెలబ్రిటీలు చిన్న తప్పుచేసినా ఒప్పుకునేందుకు వారికి ధైర్యం చాలదు. ఎందుకంటే వారి పేరు, పరువు, పత్రిష్టలు అంటూ ఆలోచిస్తారు. కానీ బాలీవుడ్ నటుడు కునాల్ కేము తాను ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన అంగీకరిస్తూ అందరికీ తెలిసేలా చేశాడు. తనకు బైక్స్ అంటే ఇష్టమని, కానీ కొన్ని సందర్భాల్లో హెల్మెట్ లేకుండా వెళ్తుంటానని, అలాంటి సందర్భంలో తీసిందే ఈ ఫొటో అంటూ కునాల్ ఓ ట్వీట్ చేశాడు. దగ్గర్లో ఉన్న ఇంటికి వెళ్లినా, లేక వేరే ప్రాంతానికి వెళ్తున్నామా అన్న దాంతో సంబంధం లేకుంగా కచ్చితంగా హెల్మెట్ ధరించాలంటూ పోస్ట్ చేయగా ముంబై పోలీసులు స్పందించారు.

'నీకు బైక్స్ అంటే ఇష్టం. మాకు ప్రజల భద్రతంటే ఇష్టము. మీ తప్పు ఒప్పుకోవడం ప్రమాదాలను నివారించదు కదా. మీకు రూ.500 ఈ- చలానా జారీ చేశాం. ఇంటికి త్వరలోనే వస్తుందంటూ' ముంబై పోలీసులు ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో ఈ చలానా నెంబర్ వివరాలు వెల్లడించారు. అనిల్ కశ్యప్ అనే నెటిజన్ కునాల్ హెల్మెట్ లేకుండా వెళ్తున్న ఫొటోలను పోస్ట్ చేసి ఇతడికి చలానా కోరుకుంటున్నాడని ట్వీట్ చేయడంతో వార్తల్లో కెక్కాడు నటుడు. తప్పు ఒప్పుకుని, తాను మరోసారి తప్పుచేయనని ట్వీట్ చేసినందుకు నెటిజన్లు నటుడిని ప్రశంసించారు. అసలు ఎప్పుడో జరిగిన ఘటనకు ఇప్పుడు ఫైన్ వేస్తారా అని కొందరు ప్రశ్నించగా.. బైక్‌పై నెంబర్ ఎలా ఉందో పోలీసులు పట్టించుకుంటారా లేదా అని మరికొందరు ముంబై పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top