కిడ్నాపర్గా రాజ్తరుణ్ | Kittu Unnadu Jagratha teaser | Sakshi
Sakshi News home page

కిడ్నాపర్గా రాజ్తరుణ్

Dec 11 2016 1:40 PM | Updated on Sep 4 2017 10:28 PM

కిడ్నాపర్గా రాజ్తరుణ్

కిడ్నాపర్గా రాజ్తరుణ్

టాలీవుడ్ మినిమమ్ గ్యారెంటీ హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. సోలో సినిమాలతో పాటు మల్టీ స్టారర్లతోనూ ఆకట్టుకుంటున్న

టాలీవుడ్ మినిమమ్ గ్యారెంటీ హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. సోలో సినిమాలతో పాటు మల్టీ స్టారర్లతోనూ ఆకట్టుకుంటున్న రాజ్ తరుణ్, ఓ డిఫరెంట్ కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాతో మరోసారి తన మార్క్ కామెడీ అందించేందుకు రెడీ అవుతున్నాడు.

వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ కిడ్నాపర్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే  మనుషులు కిడ్నాపర్గా కాదు. కుక్కల కిడ్నాపర్గా కనిపించనున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ టీజర్లో తను మనుషులను కాకుండా కుక్కలనే ఎందుకు కిడ్నాప్ చేస్తున్నాడో క్లియర్గా వివరించాడు హీరో. రాజ్ తరుణ్ సరసన అను ఇమ్మన్యూల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్భాజ్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement