కల్కీ కిక్‌ | Kalki Koechlin to Perform Special Dance Number in Tamil Remake of Pink | Sakshi
Sakshi News home page

కల్కీ కిక్‌

Apr 10 2019 3:38 AM | Updated on Apr 10 2019 3:38 AM

Kalki Koechlin to Perform Special Dance Number in Tamil Remake of Pink - Sakshi

స్పెషల్‌ సాంగ్స్‌ మాస్‌ ఆడియన్స్‌కు స్పెషల్‌ కిక్‌ ఇస్తాయి. అందులోని డ్యాన్స్‌ మూమెంట్స్‌ అదిరిపోయేలా ఉంటే థియేటర్స్‌లో ఆడియన్స్‌ ఉత్సాహం ఇంకా పెరుగుతుంది. ఈ మ్యాజిక్‌నే క్రియేట్‌ చేయడానికి అజిత్‌ అండ్‌ టీమ్‌ ప్లాన్‌ వేసింది. బాలీవుడ్‌ స్పెషల్‌ సాంగ్స్‌ ఫేమ్‌ కల్కీ కొచ్లిన్‌తో స్పెషల్‌ సాంగ్‌ను షూట్‌ చేసింది  ‘నేర్కొండ పార్వై’ టీమ్‌. అజిత్, శ్రద్ధాశ్రీనాథ్, అభిరామి వెంకటాచలం, ఆండ్రియా టరియాంగ్‌ ప్రధాన పాత్రల్లో విద్యాబాలన్‌ కీలక పాత్ర చేసిన చిత్రం ‘నేర్కొండ పార్వై’. బోనీ కపూర్‌ నిర్మించారు. హిందీలో అమితాబ్‌ బచ్చన్, తాప్సీ నటించిన ‘పింక్‌’ చిత్రానికి ఇది తమిళ రీమేక్‌. ఈ సినిమాలో కల్కీతో ఓ స్పెషల్‌ సాంగ్‌ చిత్రీకరించారు. ‘‘ఇదొక పెప్పీ సాంగ్‌. ఇందులో క్యాప్‌ అండ్‌ హిప్పీ మూమెంట్స్‌ కూడా ఉన్నాయి. కల్కీనే కరెక్ట్‌ అనిపించింది. ఆమె అద్భుతంగా డ్యాన్స్‌ చేశారు’’ అన్నారు బోనీ. ఈ సినిమాలో అజిత్‌ భార్యగా విద్యాబాలన్‌ నటించారు. హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వేసవిలో రిలీజ్‌ కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement