తెలుగు 'కబాలి' గర్జిస్తే.. | kabali telugu teaser released | Sakshi
Sakshi News home page

తెలుగు 'కబాలి' గర్జిస్తే..

May 1 2016 7:05 PM | Updated on Sep 3 2017 11:12 PM

తెలుగు 'కబాలి' గర్జిస్తే..

తెలుగు 'కబాలి' గర్జిస్తే..

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ తాజా సినిమా 'కబాలి'.

హైదరాబాద్‌: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ తాజా సినిమా 'కబాలి'. ఈ సినిమా తమిళ వెర్షన్‌ టీజర్‌ ఇప్పటికే విడుదలై సంచలనం సృష్టిస్తోంది. టీజర్‌ వచ్చిన కొన్ని గంటల్లోనే 1.8 మిలియన్‌ కిపైగా వ్యూస్ దీనికి వచ్చాయి. ఇదీ రజనీ స్టామినా అని టీజర్ చాటుతోంది.. ఇక తెలుగు వెర్షన్‌ 'కబాలి' టీజర్‌ కూడా ఇప్పుడే ఆన్‌లైన్‌లో రిలీజైంది. 'పాత తెలుగు చిత్రాల్లో బుగ్గపై గాటు పెట్టుకుని, మీసాలు తిప్పుకొంటూ, లుంగీ కట్టుకుని పాత విలన్‌ ఏయ్‌! కబాలి అని పిలవగానే... వంగుని వినయంగా ఎస్‌ బాస్‌ అంటూ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నావా?.. కబాలి... రా' అంటూ రజనీ ఈ టీజర్‌లో తన విశ్వరూపం చూపెట్టాడు.

రజనీ స్టైల్‌కి, స్టామినాకి తగ్గట్టు రూపొందిన 'కబాలి' టీజర్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. దర్శక బాహుబలి ఎస్ఎస్ రాజమౌళి సహా పలువురు టాలీవుడ్, కోలీవుడ్‌, బాలీవుడ్ ప్రముఖులు రజనీ స్టైల్‌కు నీరాజనాలు పడుతున్నారు. నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు భావిస్తున్న ఈ సినిమాలో రజనీ వృద్ధ డాన్‌గా రెండు పార్శ్వాలున్న వైవిధ్యమైన పాత్రను పోషిస్తుండగా.. ఆయన భార్యగా రాధిక ఆప్టే కనిపించనుంది. పా రంజిత్ దర్శకత్వంలో వస్తున్న 'కబాలి' సినిమా కథ అండర్‌ వరల్డ్ మాఫియా చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement