అల్లరి నరేశ్ ద్విపాత్రాభినయంలో అంబికా రాజా నిర్మించిన చిత్రం ‘జంప్ జిలానీ’. అంబికా కృష్ణ సమర్పణలో వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్-రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రానికి ఇ. సత్తిబాబు దర్శకుడు. విజయ్ ఎజెంజర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో వినూత్న రీతిలో ఆవిష్కరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పారాచ్యూట్లాంటి రెండు ఎయిర్ బెలూన్స్లో చిత్రబృందానికి సంబంధించిన కీలక సభ్యులు, అతిథులు నింగికి ఎగిరారు. అక్కడే మంచు మనోజ్ ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఈ ఆడియో వేడుకలో శ్రీధర్ స్వామీజీ, కె. రాఘవేంద్రరావు, రమేష్‌ప్రసాద్, మురళీమోహన్, డి. సురేష్‌బాబు, ‘దిల్’ రాజు, బెల్లంకొండ సురేశ్, లగడపాటి శ్రీధర్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.
ఆడియో వేదికపై నిఖిల్ సీడీని ఆవిష్కరించి ఆర్యన్ రాజేష్‌కి ఇచ్చారు. అంబికా కృష్ణ మాట్లాడుతూ - ‘‘వినూత్న పద్ధతిలో పాటలను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. మా సంస్థపై మరిన్ని మంచి సినిమాలు తీస్తాం’’ అని చెప్పారు. నాన్నగారి తరహా హాస్యం సత్తిబాబులో ఉందనీ, ఈ సినిమాని బాగా తీశాడని నరేశ్ అన్నారు. ఈ నెల 12న సినిమాని విడుదల చేస్తామని చిత్ర నిర్మాణ నిర్వాహకుడు అంబికా రామచంద్రరావు తెలిపారు. సత్తిబాబు మాట్లాడుతూ - ‘‘తమిళంలో విజయం సాధించిన ‘కలగలప్పు’కి ఇది రీమేక్. జంప్ జిలానీ అనే పదాన్ని దాదాపు అందరూ వాడతారు. ఈ సినిమాలో కొన్ని పాత్రలు కథానుగుణంగా జంప్ అవుతుంటాయి’’ అని చెప్పారు. ఈ చిత్రంలో నటించడంపట్ల ఇషా చావ్లా, స్వాతీ దీక్షిత్ తమ ఆనందం వ్యక్తం చేశారు.
వినూత్న తరహాలో జంప్ జిలానీ ఆడియో ఆవిష్కరణ
Published Sun, Jun 1 2014 10:41 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గవర్నర్‌పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
టీడీపీపై ఎన్నికల సంఘం సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్‌కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్‌సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement