మహిళల పట్ల పురుషుల ధోరణి మారాలి: జాన్ అబ్రహాం | John Abraham bats for women’s safety | Sakshi
Sakshi News home page

మహిళల పట్ల పురుషుల ధోరణి మారాలి: జాన్ అబ్రహాం

Jun 10 2014 9:31 PM | Updated on Apr 3 2019 6:23 PM

మహిళల పట్ల పురుషుల ధోరణి మారాలి: జాన్ అబ్రహాం - Sakshi

మహిళల పట్ల పురుషుల ధోరణి మారాలి: జాన్ అబ్రహాం

సమాజంలోని మహిళల పట్ల పురుషుల ధోరణి మారాలని బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం పేర్కొన్నాడు.

న్యూఢిల్లీ: సమాజంలోని మహిళల పట్ల పురుషుల ధోరణి మారాలని బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం పేర్కొన్నాడు. భద్రతపై భరోసా కలిగించే వాతావర ణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందన్నాడు. మద్రాస్ కేఫ్ సినిమాలో నటించిన ఈ 41 ఏళ్ల నటుడు నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యాసిడ్ దాడి బాధితులను పరామర్శించిన అనంతరం మీడియాతో సమాజంపట్ల తన మనోభావాలను మీడియాతో పంచుకున్నాడు. ‘మహిళలపట్ల పురుషుల ధోరణిలో మార్పు రావడంలో తల్లిదండ్రులదే కీలకపాత్ర. మహిళల విషయంలో ఔదార్యంతో ఉండాలనే విషయాన్ని పిల్లలకు వారి తల్లిదండ్రులు తరచూ తప్పనిసరిగా బోధిస్తూ ఉండాలి.

 

భార్యపట్ల భర్త ఎలా ఉంటాడనే విషయాన్ని పిల్లలు గమనిస్తుంటారు. దానినే వారు కూడా అనుకరిస్తారు. పిల్లలకు విద్య అనేది ఇంటి వద్దనే ప్రారంభమవుతుంది. వారి జీవితంలో ఇదే కీలకపాత్ర పోషిస్తుంది’ అని అన్నాడు. దాడులకు పాల్పడేవారి విషయంలో చట్టాలు అత్యంత కటువుగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement