సెలవుల్లోనూ వర్కవుట్‌ | Janhvi Kapoor Working Out On Her Trip To New York | Sakshi
Sakshi News home page

సెలవుల్లోనూ వర్కవుట్‌

Sep 28 2019 2:09 AM | Updated on Sep 28 2019 2:09 AM

Janhvi Kapoor Working Out On Her Trip To New York  - Sakshi

‘‘ఎక్సర్‌సైజ్‌లకు సెలవు ఇవ్వకండి.. బద్దకించకుండా వర్కవుట్లు చేయండి.. చక్కగా ఉండండి’’ అంటున్నారు జాన్వీ కపూర్‌. ‘ధడక్‌’ చిత్రంతో కథానాయిక అయిన జాన్వీ వరుసగా సినిమాలు సైన్‌ చేస్తూ బిజీగా ఉన్నారు. ఎంతసేపూ పని అంటే బోరే కదా.. అందుకే తండ్రి బోనీ కపూర్, చెల్లెలు ఖుషీ కపూర్‌తో కలిసి విహార యాత్ర ప్లాన్‌ చేసుకున్నారు. ఈ ముగ్గురూ న్యూయార్క్‌ చెక్కేశారు. చక్కగా ఎంజాయ్‌ చేస్తున్నారు. షూటింగ్‌లకైతే సెలవు చెప్పారు కానీ వ్యాయామాలకు మాత్రం ‘నో హాలిడే’ అన్నారు జాన్వీ.

వెకేషన్లో కూడా వర్కవుట్లు చేస్తున్నారు. న్యూయార్క్‌లోని జిమ్‌లో వర్కవుట్లు చేస్తున్న ఓ వీడియోను జాన్వీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఫిట్‌నెస్‌ మీద ఈ బ్యూటీకి ఎంత శ్రద్ధో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. శ్రీదేవి కూడా అంతే. ఫిట్‌నెస్‌కి చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. 50 ఏళ్ల వయసులోనూ మంచి శరీరాకృతితో ఉండేవారామె. కూతురికి కూడా తల్లిలా ఫిట్‌నెస్‌ అంటే చాలా ఇంట్రస్ట్‌ అని చెప్పొచ్చు. ఇక సినిమాల విషయానికొస్తే, తొలి మహిళా పైలట్‌ గుంజన్‌ సక్సేనా జీవితం ఆధారంగా రూపొందిన ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గాళ్‌’లో టైటిల్‌ రోల్‌ చేశారు జాన్వీ. వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇక వెకేషన్‌ నుంచి ముంబై తిరిగి రాగానే ‘దోస్తానా 2’ షూటింగ్‌లో పాల్గొంటారు.

Advertisement
 
Advertisement
Advertisement