జల్లికట్టు కోసం కొనసాగుతున్న నిరసనలు | Jallikattu protests gain strength in Tamil Nadu | Sakshi
Sakshi News home page

జల్లికట్టు కోసం కొనసాగుతున్న నిరసనలు

Jan 18 2017 1:01 PM | Updated on Sep 5 2017 1:32 AM

జల్లికట్టు కోసం కొనసాగుతున్న నిరసనలు

జల్లికట్టు కోసం కొనసాగుతున్న నిరసనలు

తమిళుల సాంప్రదాయ క్రీడ, జల్లికట్టు కోసం సామాన్య ప్రజలతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా నిరసనలకు దిగుతున్నారు.

చెన్నై : తమిళుల సాంప్రదాయ క్రీడ, జల్లికట్టు కోసం సామాన్య ప్రజలతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా నిరసనలకు దిగుతున్నారు. ఇప్పటికే సినీ రంగంనుంచి స్టార్ హీరోలు సాంకేతికనిపుణులు జల్లికట్టు కోసం తమ గళం వినిపించగా తాజాగా బహిరంగ నిరసనకు దిగారు. సంక్రాంతి పండుగ ముగిసినా వివాదం మాత్రం సద్దుమణగటం లేదు. జల్లికట్టును నిషేదిస్తూ కోర్టు తీర్పునిచ్చినా.. నిరసనకారులు మాత్రం వెనక్కి తగ్గటం లేదు.

తాజాగా మెరీనా బీచ్ లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో తమిళ స్టార్ హీరోలు సూర్య, విశాల్, విజయ్, శింబు, లారెన్స్ లు పాల్గొన్నారు. ఆందోళనలో భాగంగా మంగళవారం రాత్రి కూడా బీచ్ లోనే ఉన్న ఆందోళనకారులు బుధవారం కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మెరీనా బీచ్ పరిసర ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులు నిరసన కారులు గుమిగూడి ఉన్నారు. ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది కలిగించకపోయినా.. ముందు జాగ్రత్తగా భారీ ఎత్తున బీచ్ పరిసరాల్లో పోలీసు బలగాలను మోహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement