జై లవ కుశ : ఎన్టీఆర్ మూడో లుక్ | Jai Lava Kusa Ntr Third Character look | Sakshi
Sakshi News home page

జై లవ కుశ : ఎన్టీఆర్ మూడో లుక్

Aug 25 2017 10:52 AM | Updated on Sep 12 2017 1:00 AM

వినాయక చవితికి ఒక రోజు ముందుగానే లవ టీజర్తో ఆకట్టుకున్న ఎన్టీఆర్. వినాయక చవితి రోజు మరో సర్ ప్రైజ్ ఇచ్చాడు.

వినాయక చవితికి ఒక రోజు ముందుగానే లవ టీజర్తో ఆకట్టుకున్న ఎన్టీఆర్. వినాయక చవితి రోజు మరో సర్ ప్రైజ్ ఇచ్చాడు. యంగ్ టైగర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తుండగా ఇప్పటికే జై, లవ పాత్రలకు సంబంధించిన లుక్స్ టీజర్స్ బయటకు వచ్చేశాయి.

తాజాగా మూడో పాత్ర కుశ లుక్ను కూడా రిలీజ్ చేశారు. ఈ లుక్ లో ఎన్టీఆర్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ట్రెండీగా కనిపిస్తున్నాడు. ఈ నెలాఖరున కుశ టీజర్ ను కూడా రిలీజ్ చేసి సెప్టెంబర్ 3న అభిమానుల సమక్షంలో ఆడియో రిలీజ్ ను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement