అభిమానులకు ఎన్టీఆర్ బర్త్డే గిఫ్ట్ | Jai Lava Kusa first look on Ntr birthday | Sakshi
Sakshi News home page

అభిమానులకు ఎన్టీఆర్ బర్త్డే గిఫ్ట్

May 9 2017 1:19 PM | Updated on Sep 5 2017 10:46 AM

అభిమానులకు ఎన్టీఆర్ బర్త్డే గిఫ్ట్

అభిమానులకు ఎన్టీఆర్ బర్త్డే గిఫ్ట్

జనతా గ్యారేజ్ సినిమాతో కెరీర్లో బిగెస్ట్ హిట్ సాధించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవకుశ సినిమా

జనతా గ్యారేజ్ సినిమాతో కెరీర్లో బిగెస్ట్ హిట్ సాధించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవకుశ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన టైటిల్ లోగోకు మంచి రెస్పాన్స్ రావటంతో ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తుండటంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

చిత్రయూనిట్ ఆ అంచనాలు మరింత పెంచే విధంగా ఫస్ట్ లుక్ పోస్టర్ను రూపొందిస్తున్నారట. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్తో పాటు మోషన్ పోస్టర్ను కూడా రిలీజ్ చేస్తున్నారు. సినిమాలో ఎన్టీఆర్ పోషిస్తున్న మూడు గెటప్లను మిక్స్ చేసి డిఫరెంట్గా ఫస్ట్ లుక్ పోస్టర్ను డిజైన్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ సరసన నివేదా థామస్, రాశీ ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement