నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను: సుస్మితా సేన్ | I will certainly get married: Sushmita Sen | Sakshi
Sakshi News home page

నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను: సుస్మితా సేన్

May 22 2014 3:39 PM | Updated on Sep 2 2017 7:42 AM

నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను: సుస్మితా సేన్

నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను: సుస్మితా సేన్

నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అని సుస్మితా సేన్ అన్నారు.

నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అని సుస్మితా సేన్ అన్నారు. అంతేకాకుండా ఓ అందమైన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాను మీడియాకె వెల్లడించింది. ఈ సమాజంలోని ఆచారాలను పాటించను. మన సమాజమే ఈ వ్యవస్థను రూపొందించింది. 18 ఏళ్లకు డిగ్రీ పూర్తి చేసి.. 22 ఏళ్లకు పెళ్లి చేసుకుని.. 27 ఏళ్లకు పిల్లల్ని కనే పద్దతి తనకు నచ్చదని సుస్మితా అన్నారు.
 
ఆచారాలు, సాంప్రదాయాలను తాను పాటించను అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రతి ఒక్క వ్యక్తి డీఎన్ ఏ వేర్వేరుగా ఉంటుంది. ఏదో ఒకరోజు పెళ్లి చేసుకుంటానని అన్నారు. మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకుని 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సుస్మిత క్యాన్సర్ రోగుల మధ్య ఓ వేడుకను జరుపుకుంది.  
 
రణదీప్ హుడా, విక్రమ్ భట్ బాలీవుడ్ నటులతోనూ, పాకిస్థాన్ క్రికెటర్ వసీం అక్రమ్ తో డేటింగ్ చేసినట్టు మీడియాలో రూమర్లు షికారు చేసిన సంగతి తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement