చిన్నపిల్లోడిగా ఎదుగుతున్నా | I am growing up very fast into a child | Sakshi
Sakshi News home page

చిన్నపిల్లోడిగా ఎదుగుతున్నా

Mar 30 2018 12:22 AM | Updated on Mar 30 2018 12:22 AM

I am growing up very fast into a child - Sakshi

షారుక్‌ ఖాన్‌

ఎవరైనా ఎదుగుతూ ఎదుగుతూ పెద్దవాళ్లు అయిపోతారు. కానీ బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్‌ ఖాన్‌ మాత్రం చిన్నపిల్లాడిగా ఎదుగుతున్నారట.  చిన్నపిల్లాడు అయిపోవటానికి కారణం ఏంటంటే.. షారుక్‌ ఖాన్‌ ప్రస్తుతం ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ డైరెక్షన్‌లో ‘జీరో’ సినిమాలో యాక్ట్‌ చేస్తున్నారు. ఇందులో ఆయన మరుగుజ్జు పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా పూర్తయ్యే వరకూ వేరే సినిమా సైన్‌ చేయకూడదని ఫిక్స్‌ అయ్యారు షారుక్‌. ఈ కమిట్‌మెంట్‌ చూస్తేనే అర్థం అవుతుంది ఈ సినిమాపై షారుక్‌ ఎంత ప్రేమను పెంచుకున్నారో.

‘జీరో’ అనుభవాలను షేర్‌ చేసుకుంటూ –‘‘ ఐయామ్‌ లవ్వింగ్‌ అంyŠ  లివ్వింగ్‌ ఇన్‌ ‘జీరో’ (జీరోని ప్రేమిస్తున్నాను, అలాగే జీవిస్తున్నాను కూడా) టీమ్‌ అందరికీ ధన్యవాదాలు. ఈ ఎక్స్‌పీరియన్స్‌ని వివరించమంటే మాత్రం ‘చిన్నపిల్లోడిగా ఎదిగిపోతున్నాను. అది కూడా చాలా ఫాస్ట్‌గా’ అని చెప్ప  గలను’’ అని పేర్కొన్నారు షారుక్‌. కత్రినా కైఫ్,అనుష్కా శర్మ కథానాయికలు. గౌరీ ఖాన్, ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 21న రిలీజ్‌ కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement