హృతిక్‌ హాలీవుడ్‌ ఎంట్రీ.. | Hrithik Roshan Ready To Enter Hollywood | Sakshi
Sakshi News home page

హృతిక్‌ హాలీవుడ్‌ ఎంట్రీ..

Mar 4 2020 3:03 PM | Updated on Mar 4 2020 3:07 PM

Hrithik Roshan Ready To Enter Hollywood - Sakshi

బాలీవుడ్‌ గ్రీక్‌ గాడ్‌ హాలీవుడ్‌ ఎంట్రీ

ముంబై : బాలీవుడ్‌ గ్రీక్‌గాడ్‌ హృతిక్‌ రోషన్‌ గ్లోబల్‌ స్టార్‌లా మారునున్నారు. హాలీవుడ్‌లో ఎంటరయ్యేందుకు అమెరికాకు చెందిన గెర్ష్‌ ఏజెన్సీతో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు. హృతిక్‌ నాయకత్వంలో అంతర్జాతీయ సినీ వినోద రంగంలో భారత్‌ను ముందు నిలుపుతామని, దేశంలో వినూత్న క్రియేటర్లకు ఇతర మార్కెట్లను అందుబాటులోకి తీసుకువస్తామని గెర్ష్‌తో భాగస్వామ్యం ద్వారా హృతిక్‌ విజన్‌ను విశ్వవ్యాప్తం చేస్తామని సెలబ్రిటీ మేనేజ్‌మెంట్‌ సంస్థ క్వాన్‌ మేనేజర్‌ అమృతా సేన్‌ వెల్లడించారు. గెర్ష్‌ ఏజెన్సీ హృతిక్‌ను హాలీవుడ్‌కు పరిచయం చేయడంతో పాటు భారత్‌లో ఆయా ప్రాజెక్టుల నిర్మాణం జరిగేలా చూస్తుంది. నటుడు, నిర్మాత రాకేష్‌ రోషన్‌ కుమారుడు హృతిక్‌ రోషన్‌ 2000లో కహోనా ప్యార్‌ హై మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కొన్నేళ్లకే బ్లాక్‌బస్టర్‌ మూవీలతో హృతిక్‌ సూపర్‌స్టార్‌గా ఎదిగారు. ఇటీవల విడుదలైన హృతిక్‌ సినిమాలు సూపర్‌ 30, వార్‌ మూవీలు బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి. 

చదవండి : హృతిక్‌రోషన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

Advertisement
 
Advertisement
Advertisement