అందం కోసం తేనెటీగలతో కుట్టించుకుంది! | Gwyneth Paltrow got stung by bees to stay beautiful | Sakshi
Sakshi News home page

అందం కోసం తేనెటీగలతో కుట్టించుకుంది!

Apr 6 2016 8:54 PM | Updated on Sep 3 2017 9:20 PM

అందం కోసం తేనెటీగలతో కుట్టించుకుంది!

అందం కోసం తేనెటీగలతో కుట్టించుకుంది!

హాలివుడ్ నటి గ్వైనెత్ పాల్త్రోవ్ తాజాగా ఆంక్యుపంచర్లో భాగంగా తేనెటీగలతో డజన్ల సార్లు కుట్టించుకున్నానని తెలిపింది.

లాస్ ఏంజెల్స్: అందంగా కనిపించడానికి ఏదైనా చేస్తానని అంటోంది.. హాలివుడ్ నటి గ్వైనెత్ పాల్త్రోవ్. తాజాగా ఆక్యుపంక్చర్లో భాగంగా తేనెటీగలతో డజన్ల సార్లు కుట్టించుకున్నానని చెప్పిందీ భామ. అంతేకాదు తనను తాను గినియా పందితో పోల్చుకున్న ఈ ఆస్కార్ విన్నర్ ఏం చేయడానికైనా ఎప్పుడూ సిద్దంగా ఉంటానంటోంది.

తేనెటీగలతో తీసుకునే ఈ చికిత్స వేల సంవత్సరాల నుంచి అందుబాటులో ఉందని తెలిపింది. ఎపిథెరపీగా పిలిచే ఈ చికిత్సను చర్మం మీద మచ్చలను తగ్గించుకునేందుకు చేయించుకుంటారని, అయితే.. ఈ చికిత్స చేయించుకోవడానికి చాలా ధైర్యం, నొప్పిని భరించగల శక్తి ఉండాలని చెప్పింది 43 ఏళ్ల పాల్త్రోవ్. కీళ్ల నొప్పులు, వాపు, చర్మం మీద ఎర్రగా కనిపించడం, రక్తప్రసరణను పెంచడానికి ఆక్యుపంక్చర్ బాగా ఉపయోగపడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement