'టైటానిక్' హీరోకి గోల్డెన్ గ్లోబ్ పురస్కారం | Golden Globe Awards 2016: Complete list of winners | Sakshi
Sakshi News home page

'టైటానిక్' హీరోకి గోల్డెన్ గ్లోబ్ పురస్కారం

Jan 11 2016 11:19 AM | Updated on Sep 3 2017 3:29 PM

'టైటానిక్' హీరోకి గోల్డెన్ గ్లోబ్ పురస్కారం

'టైటానిక్' హీరోకి గోల్డెన్ గ్లోబ్ పురస్కారం

73 గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం కాలిఫోర్నియాలోని బెవెర్లీ హిల్స్లో అట్టహాసంగా జరిగింది.

కాలిఫోర్నియా: 73 గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం కాలిఫోర్నియాలోని బెవెర్లీ హిల్స్లో అట్టహాసంగా జరిగింది. హాలీవుడ్ తారల వెలుగుజిలుగుల మధ్య ఆద్యంతం కన్నులపండువగా జరిగిన ఈ వేడుకలో ఉత్తమ నటుడి అవార్డు 'టైటానిక్' స్టార్ లియోనార్డ్ డీకాప్రియోను వరించింది. డ్రామా కేటగిరిలో 'ద రెవెనంట్' సినిమాలో చూపిన అభినయానికిగాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది. ఉత్తమ నటి పురస్కారాన్ని బ్రీ లార్సన్ కైవసం చేసుకుంది. డ్రామ కేటగిరీలో 'రూమ్'  సినిమాలో చూపిన నటనకుగాను ఆమెను ఈ అవార్డు వరించింది.

డ్రామా కేటగిరీలో ఉత్తమ చిత్రంగా 'రెవెనంట్' నిలువగా, మ్యూజికల్, కామెడీ కేటగిరీలో 'మార్షియన్' ఉత్తమ సినిమా అవార్డు దక్కించుకుంది. ఈ ఏడాది 'రెవెనంట్' చిత్రం అధిక గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలతో సత్తా చాటింది. డ్రామా కేటగిరీలో ఉత్తమ దర్శకుడి అవార్డు కూడా 'రెవెనంట్' డైరెక్టర్ అలెజాండ్రో ఇనారితును వరించింది. ఇక మ్యూజికల్ కామెడీ కేటగిరీలో ఉత్తమ నటుడిగా మాట్ డామన్ (మార్షియన్), ఉత్తమ నటిగా జెన్నిఫర్ లారెన్స్ (జాయ్)  పురస్కారాలు దక్కించుకున్నారు. ఇక 'క్రీడ్' సినిమాకుగాను సీనియర్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ ఉత్తమ సహాయ నటుడి పురస్కారం గెలుపొందారు.

Advertisement
 
Advertisement
Advertisement