గీత గోవిందం : తొలి పాటతో సిద్ధం

Geetha Govindam First Song Launch On 10th July - Sakshi

అర్జున్‌ రెడ్డి సినిమాతో సెన్సేషనల్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్‌ దేవరకొండ. ఈ యువ కథానాయకుడు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గీత గోవిందం. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలను చిత్రయూనిట్ ఇటీవల ప్రారంభించారు. విజయ్‌ తనదైన స్టైల్‌లో ట్వీటర్‌ వేదికగా ఆసక్తికర కామెంట్స్‌తో సినిమా మీద హైప్‌ క్రియేట్‌ చేస్తున్నాడు విజయ్‌.

ఇప్పటికే ఫస్ట్‌లుక్‌, పోస్టర్లతో ఆకట్టుకున్న చిత్రయూనిట్‌ జూలై 10న తొలి పాటను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. గోపి సుందరం సంగీత సారధ్యంలో ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’ అంటూ సాగే ఈ పాటను మంగళవారం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. పరుశురామ్‌ దర‍్శకత్వంలో బన్నీవాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఛలోఫేం రష్మిక మందన హీరోయిన్‌ గా నటిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top