నేనే కాదు.. రాందేవ్, మోదీ కూడా బ్రహ్మచారులే | feel blessed to see those being single, says rakhi sawant | Sakshi
Sakshi News home page

నేనే కాదు.. రాందేవ్, మోదీ కూడా బ్రహ్మచారులే

Jan 13 2017 5:45 PM | Updated on Sep 5 2017 1:11 AM

నేనే కాదు.. రాందేవ్, మోదీ కూడా బ్రహ్మచారులే

నేనే కాదు.. రాందేవ్, మోదీ కూడా బ్రహ్మచారులే

ఇప్పటివరకు ఒంటరిగా జీవించడమే ఆనందంగా ఉందని బాలీవుడ్ నటి రాఖీసావంత్ తెలిపింది.

ఇప్పటివరకు ఒంటరిగా జీవించడమే ఆనందంగా ఉందని బాలీవుడ్ నటి రాఖీసావంత్ తెలిపింది. బాబా రామ్ దేవ్, ప్రధాని మోదీ, సల్మాన్ ఖాన్... వీళ్లంతా బ్రహ్మచారులేనని, వాళ్లను చూసి తాను కూడా ప్రస్తుతానికి అలాగే ఉండాలనుకుంటున్నానని చెప్పింది. అయితే తన సహచర భాగస్వామిని ఎంచుకునేందుకు మరోమారు 'రాఖీ కా స్వయంవర్' రియాలిటీ షోను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. రాఖీసావంత్ ఇంతకుముందు క్రేజీ 4,1920 వంటి సినిమాల్లో నటించారు. 
 
2009లో నిర్వహించిన ఇదే రియాలిటీ షో మొదటి సీజన్‌లో కెనడియన్ వ్యాపారవేత్త ఈలేష్ పరుజన్‌వాలాను తన భర్తగా ఎంచుకుంది. అయితే తర్వాత కొన్ని అభిప్రాయ భేదాలతో ఇద్దరూ విడిపోయారు. డబ్బు కోసమే తాను ఈలేష్‌ను ఇష్టపడ్డానని ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో రాఖీ చెప్పింది. ధనవంతుడు, కష్టపడేవాడు, నలుగురిలో తిరిగేవాడు, శక్తిమంతుడైన వ్యక్తి దొరికేవరకు తాను పెళ్లి గురించి ఆలోచించేది లేదని ఇప్పుడు తాజాగా స్పష్టం చేసింది. అలాంటివాడిని వెతికి పట్టుకోవాలనే తన స్వయంవరాన్ని మరోసారి నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. కాగా, రాఖీ ఈ సంవత్సరమైనా పెళ్లి చేసుకుంటే మంచిదని ఆమె స్నేహితురాలు, హాలీవుడ్ నటి సోఫియా హయత్ అన్నారు. ఆ మాటలను మాత్రం రాఖీ పట్టించుకున్నట్లు లేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement