విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయి | Director VV Vinayak Saakshyam Movie | Sakshi
Sakshi News home page

విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయి

Jul 26 2018 12:55 AM | Updated on Aug 22 2019 9:35 AM

Director VV Vinayak Saakshyam Movie - Sakshi

అభిషేక్‌ నామా, వీవీ వినాయక్, బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే

‘‘అల్లుడుశీను’ సినిమా విడుదలై అప్పుడే నాలుగేళ్లయిందంటే నమ్మలేకపోతున్నా. నిన్ననే షూటింగ్‌ చేసినట్లుంది. సినిమా సినిమాకి సాయి చాలా మెచ్యూర్డ్‌గా ఎదుగుతున్నాడు. ‘సాక్ష్యం’ ట్రైలర్‌ చాలా బాగుంది. విజువల్స్‌ మైండ్‌ బ్లోయింగ్‌గా ఉన్నాయి. అభిషేక్‌ నామా ‘సాక్ష్యం’ని అంత గ్రాండ్‌గా నిర్మించారు. ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవ్వాలి’’ అని దర్శకుడు వీవీ వినాయక్‌ అన్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, పూజా హేగ్డే జంటగా శ్రీవాస్‌ దర్శకత్వంలో అభిషేక్‌ నామా నిర్మించిన ‘సాక్ష్యం’ రేపు విడుదలవుతోంది.

‘సాక్ష్యం’ చిత్రంలోని హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్‌ ‘డెస్టినీ’ని వినాయక్‌ రిలీజ్‌ చేశారు. సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘మా టీమ్‌ అందరం కలిసి ఒక మంచి సినిమా చేశాం. ఇలాంటి చిత్రాలను ఆదరిస్తేనే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. అభిషేక్‌గారు ఈ చిత్రాన్ని లావిష్‌గా నిర్మించారు. శ్రీవాస్‌గారి విజన్‌కి ప్రతి ఒక్కరూ న్యాయం చేశారు’’ అన్నారు. ‘‘ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించి పెద్ద విజయం అందించాలి’’ అన్నారు అభిషేక్‌ నామా. ‘‘ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేసేలా ‘సాక్ష్యం’ ఉంటుంది. ఇందులో ఇప్పటివరకూ చేయని కొత్త పాత్ర చేశాను. విజువల్స్‌ చాలా బాగుంటాయి’’ అని పూజాహెగ్డే అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement