ప్రియురాలి బర్త్‌డే కోసం కరీబియన్‌కు.. | DiCaprio in Caribbean for Nina Agdal's birthday | Sakshi
Sakshi News home page

ప్రియురాలి బర్త్‌డే కోసం కరీబియన్‌కు..

Mar 27 2017 12:51 PM | Updated on Sep 5 2017 7:14 AM

ప్రియురాలి బర్త్‌డే కోసం కరీబియన్‌కు..

ప్రియురాలి బర్త్‌డే కోసం కరీబియన్‌కు..

ప్రముఖ హాలీవుడ్‌ నటుడు, ఆస్కార్‌ అవార్డు విజేత లియోనార్డో డికాప్రియో కరీబియన్‌ దీవుల్లో ప్రత్యక్షం అయ్యారు. ఆయన తన గర్ల్‌ఫ్రెండ్‌, మోడల్‌ నైనా అగ్దాల్‌ (25) పుట్టిన రోజు వేడుకల అక్కడే ఘనంగా జరిపారు.

లాస్‌ ఎంజెల్స్‌: ప్రముఖ హాలీవుడ్‌ నటుడు, ఆస్కార్‌ అవార్డు విజేత లియోనార్డో డికాప్రియో కరీబియన్‌ దీవుల్లో ప్రత్యక్షం అయ్యారు. ఆయన తన గర్ల్‌ఫ్రెండ్‌, మోడల్‌ నైనా అగ్దాల్‌ (25) పుట్టిన రోజు వేడుకల అక్కడే ఘనంగా జరిపారు. మార్చి 26న ఆమె పుట్టిన రోజు కావడంతో కొం‍తమంది స్నేహితులతో కలిసి లియోనార్డో​ప్రత్యేక విమానంలో వెళ్లినట్లు ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ పేర్కొం‍ది.

‘ఆయన ఇప్పుడే విమానంలో వెళ్లారు. అయితే, ఆ విమానం ఆయనది కాదు’ అని కూడా ఆ సైట్‌ పేర్కొంది. ఎంజెలీనాతో విడిపోయిన తర్వాత డికాప్రియో గత ఏడాది (2016) జూలై నుంచి నైనాతో ఆయన డేటింగ్‌ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఆయన 42వ పుట్టిన రోజు వేడుకలో ఫ్రాన్స్‌లోని ఓ దీవిలోగల రిసార్ట్‌లో ఇద్దరు కలిసి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement