డై..లాగి కొడితే.... | Dialog from Assembly Rowdy | Sakshi
Sakshi News home page

డై..లాగి కొడితే....

Nov 9 2016 11:27 PM | Updated on Sep 4 2017 7:39 PM

డై..లాగి కొడితే....

డై..లాగి కొడితే....

ఇండిపెండెంట్‌గా నిలబడి ఎమ్మెల్యేగా గెలుస్తాడు శివాజీ (మోహన్‌బాబు). ముఖ్యమంత్రి కావాలనే ఆశతో ఉంటాడు

సినిమా : అసెంబ్లీ రౌడీ
రచన: పరుచూరి బ్రదర్స్,
దర్శకత్వం: బి. గోపాల్
 
ఇండిపెండెంట్‌గా నిలబడి ఎమ్మెల్యేగా గెలుస్తాడు శివాజీ (మోహన్‌బాబు). ముఖ్యమంత్రి కావాలనే ఆశతో ఉంటాడు మంత్రి (సత్యనారాయణ). శివాజీ, అతని వెనక ఉన్న పాతికమంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తే తాను ముఖ్యమంత్రిని అవుతాననీ, అందుకు శివాజీకి పదిలక్షలు, మిగిలిన వారికి ఐదు లక్షల చొప్పున ఇస్తాననీ తన పీఏ ద్వారా శివాజీకి డబ్బు పంపిస్తాడు సత్యనారాయణ. ఆ డబ్బు తీసుకున్న శివాజీ, మంత్రి వద్దకు వెళ్లి విలేకరుల ముందు ఆయన్ను కడిగి పారేసి, డబ్బు తిరిగిచ్చేస్తాడు. రేయ్ అని మంత్రి మాట్లాడబోతుండగా ..
 ‘అరిస్తే చరుస్తా.. చరుస్తే కరుస్తా.. కరిస్తే ఉరి తీయిస్తా’
 అని వార్నింగ్ ఇస్తాడు శివాజీ. పాతికేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రంలోని ఈ డైలాగ్ ఇప్పటికీ పాపులర్.

Advertisement
 
Advertisement
Advertisement