ఆ గ్యాంగ్తో పెట్టుకుంటే అంతే సంగతి! | dandupalya movie sequel launched | Sakshi
Sakshi News home page

ఆ గ్యాంగ్తో పెట్టుకుంటే అంతే సంగతి!

Jun 9 2016 11:07 PM | Updated on Aug 30 2018 5:27 PM

ఆ గ్యాంగ్తో పెట్టుకుంటే అంతే సంగతి! - Sakshi

ఆ గ్యాంగ్తో పెట్టుకుంటే అంతే సంగతి!

వాళ్లు మొత్తం తొమ్మిది మంది. ఆడ, మగ ఉన్న ఆ గ్యాంగ్ అంటే అందరికీ హడల్.

వాళ్లు మొత్తం తొమ్మిది మంది. ఆడ, మగ ఉన్న ఆ గ్యాంగ్ అంటే అందరికీ హడల్. ఊరి మీద పడి, కంటికి నచ్చిన ఆడవాళ్లను రేప్ చేయడం, ఆ తర్వాత చంపడం, దొంగతనాలు చేయడం మగవాళ్ల డ్యూటీ. వీళ్లకి దీటుగా గ్యాంగ్‌లో ఉన్న ఆడవాళ్లు దోపిడీలు చేస్తుంటారు. కర్ణాటకకు చెందిన ఈ దండుపాళ్య గ్యాంగ్ ఆధారంగా శ్రీనివాసరాజు దర్శకత్వం వహించిన ‘దండుపాళ్యం’ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వెంకట్ మూవీస్ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ నిర్మించిన చిత్రం ‘దండుపాళ్యం 2’. సినిమాలో కీలక తారల పాత్రలన్నీ డీ-గ్లామరైజ్డ్‌గానే ఉంటాయి.

ఆల్రెడీ మొదటి భాగంలో పూజా గాంధీని చూసినవాళ్లు ఆశ్చర్యపోయారు. రెండో భాగంలో ఈమెతో పాటు ‘బుజ్జిగాడు మేడిన్ చెన్నై’ ఫేం సంజన కూడా నటిస్తున్నారు. ఇప్పటివరకూ చిట్టి పొట్టి దుస్తుల్లో కనిపించిన సంజన ఈ చిత్రంలో అందుకు పూర్తి భిన్నంగా డీ-గ్లామరస్‌గా కనిపించనుండటం విశేషం. చిత్రవిశేషాలను నిర్మాత తెలియజేస్తూ - ‘‘బెంగళూరులో కోటి రూపాయల వ్యయంతో వేసిన జైలు సెట్‌లో చిత్రీకరించిన సీన్స్ హైలైట్‌గా నిలుస్తాయి. ఇది సీక్వెల్ సీజన్ అనిపిస్తోంది. ‘బాహుబలి-2’, ‘రోబో’ సీక్వెల్ రూపొందుతున్నాయి. ఇలాంటి సమయంలో మా సినిమా సీక్వెల్ కూడా రూపొందడం ఆనందంగా ఉంది’’ అన్నారు. స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రతి సీన్ ఉత్కంఠగా ఉంటుందని దర్శకుడు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement