ప్రేక్షకుల వెర్రి అభిమానంతోనే నా సక్సెస్! | Complete insanity, Sunny Leone on career high | Sakshi
Sakshi News home page

ప్రేక్షకుల వెర్రి అభిమానంతోనే నా సక్సెస్!

Jul 17 2014 6:12 PM | Updated on Apr 3 2019 6:23 PM

ప్రేక్షకుల వెర్రి అభిమానంతోనే నా సక్సెస్! - Sakshi

ప్రేక్షకుల వెర్రి అభిమానంతోనే నా సక్సెస్!

సన్నీ లియోన్... ఈ పేరే ఓ సంచలనం. శృంగార చిత్రాల నాయికగా సన్నీ పొందిన ప్రఖ్యాతి అంతా ఇంతా కాదు. 41 శృంగార చిత్రాల్లో నటించిన సన్నీ, అత్యధికంగా శృంగార చిత్రాలకు కూడా దర్శకత్వం వహించింది.

సన్నీ లియోన్... ఈ పేరే ఓ సంచలనం. శృంగార చిత్రాల నాయికగా సన్నీ పొందిన ప్రఖ్యాతి అంతా ఇంతా కాదు. 41 శృంగార చిత్రాల్లో నటించిన సన్నీ, అత్యధికంగా శృంగార చిత్రాలకు కూడా దర్శకత్వం వహించింది.  రెండేళ్ల క్రితం ‘బిగ్‌బాస్’ షోలో పాల్గొని, బాలీవుడ్‌లో పాపులర్ అయిపోయిన ఆమె.. బాలీవుడ్‌లో బిజీ తార. ప్రస్తుతం ఓ అరడజను సినిమాలు సన్నీ చేతిలో ఉన్నాయి. దీనంతటికీ కారణం ప్రేక్షకులు పిచ్చి అభిమానమేనని సన్నీ లియోన్ తెలిపింది.

 

ప్రస్తుతం దక్షిణాది చిత్రాల్లో రెండు పాటల్లో నటించడానికి ఓకే చెప్పిన ఈ అమ్మడు.. ఐటం సాంగ్స్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని తెలిపింది.  ఐఎన్ఎస్ కు ఇచ్చిన తాజా ఇంటర్యూలో సన్నీఈ వ్యాఖ్యలు చేసింది. 'నేను ఈ స్థాయిలో ఉండటానికి ప్రేక్షకుల పిచ్చి అభిమానమే.  అలలా వచ్చిన నాకు ఇంతటి అభిమానం ఉందంటే అది కచ్చితంగా అభిమానులదే. వారి అండ దండలే నా సంతోషానికి కారణం'అని సన్నీ పేర్కొంది. హిందీ చిత్రాల్లో దూసుకుపోతున్న సన్నీ.. త్వరలోనే హిందీ చిత్రాలకు డబ్బింగ్ చెబుతానని స్పష్టం చేసింది. శృంగార చిత్రాలకు ఇక స్వస్థి చెప్పాలని అనుకుంటున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement