నాని గెస్ట్గా చందమామ రావే టీజర్ లాంచ్ | chandamama rave teaser launch by nani | Sakshi
Sakshi News home page

నాని గెస్ట్గా చందమామ రావే టీజర్ లాంచ్

Aug 3 2016 10:44 AM | Updated on Sep 4 2017 7:40 AM

నాని గెస్ట్గా చందమామ రావే టీజర్ లాంచ్

నాని గెస్ట్గా చందమామ రావే టీజర్ లాంచ్

అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ చందమామ రావే. ఇండియన్ స్క్రీన్ మీద తొలిసారిగా కవల సోదరులు ఇద్దరు కలిసి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే. ఇటాలియన్ ఆఫ్...

అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ చందమామ రావే. ఇండియన్ స్క్రీన్ మీద తొలిసారిగా కవల సోదరులు ఇద్దరు కలిసి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ ఫిల్మ్స్ కార్పోరేషన్ బ్యానర్పై తొలి ప్రయత్నంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ధర్మ, రక్షలు దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రియాల్ గోర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న చందమామ రావే టీజర్ను ఈ బుధవారం యంగ్ హీరో నాని చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నారు. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నవీన్ చంద్ర ఈ సినిమాలో డిఫరెంట్ లుక్లో అలరించేందుకు రెడీ అవుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement