నిర్మాతగా బిజీ అవుతోన్న హీరోయిన్ | bollywood Heroine anushka Sharma to produce three films | Sakshi
Sakshi News home page

నిర్మాతగా బిజీ అవుతోన్న హీరోయిన్

Dec 9 2015 9:18 AM | Updated on Sep 3 2017 1:44 PM

నిర్మాతగా బిజీ అవుతోన్న హీరోయిన్

నిర్మాతగా బిజీ అవుతోన్న హీరోయిన్

అతి కొద్ది కాలంలో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన హాట్ బ్యూటి అనుష్క శర్మ. హీరోయిన్ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే నిర్మాణ రంగం మీద దృష్టిపెట్టిన ఈ భామ, వరుసగా మూడు సినిమాలు...

అతి కొద్ది కాలంలో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన హాట్ బ్యూటి అనుష్క శర్మ. హీరోయిన్ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే నిర్మాణ రంగం మీద దృష్టిపెట్టిన ఈ భామ, వరుసగా మూడు సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటోంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'ఎన్హెచ్ 10' సినిమాతో నిర్మాతగా మారిన అనుష్క, అదే సినిమాలో నటనతో కూడా ఆకట్టుకుంది. అదే ఊపులో ఒకేసారి మూడు సినిమాల నిర్మాణానికి రెడీ అవుతోంది అనుష్క శర్మ.

ఈ సినిమాలు, నా కోసం నేను నిర్మించుకుంటున్నా అంటున్న అనుష్క ఇప్పటికే రెండు సినిమాల కథా కథనాలు కూడా రెడీ అయ్యాయని, మరో సినిమాకు సంబందించిన కథా చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. ఈ మూడు చిత్రాల్లో, ఎన్ హెచ్ 10 సినిమాకు దర్శకత్వం వహించిన నవదీప్ సింగ్ ఒక సినిమాను డైరెక్ట్ చేస్తుండగా, మిగతా రెండు సినిమాల ద్వారా అన్షయ్ లాల్, అక్షంత్ వర్మలు దర్శకులుగా పరిచయం అవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement