సస్పెన్స్‌ థ్రిల్లర్‌ | Blackboard Movie Trailer Launch | Sakshi
Sakshi News home page

సస్పెన్స్‌ థ్రిల్లర్‌

Nov 2 2019 3:15 AM | Updated on Nov 2 2019 3:15 AM

Blackboard Movie Trailer Launch - Sakshi

శిరీషా, సాయికృష్ణ

తల్లాడ సాయికృష్ణ, శిరీషా రావ్, విజయ్‌ దేశిని ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘బ్లాక్‌ బోర్డ్‌’. తల్లాడ సాయికృష్ణ హీరోగా నటించి, దర్శకత్వం వహించారు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్‌ పతాకంపై తల్లాడ శ్రీ లక్ష్మీ  నిర్మాణ సారధ్యంలో తల్లాడ శ్రీనివాస్‌ నిర్మించారు. ‘బ్లాక్‌ బోర్డ్‌’ ట్రైలర్‌ని హీరో ప్రిన్స్‌ విడుదల చేసి, సినిమా మంచి విజయం సాధించాలన్నారు.  నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ–‘‘సాయికృష్ణని మెచ్చుకోవడం కంటే  ముందు వాళ్ల నాన్నని అభినందించాలి. పిల్లల అభిప్రాయాన్ని గౌరవించి వారి భవిష్యత్‌ కోసం సినిమా నిర్మించడం గర్వించదగ్గ విషయం’’ అన్నారు. ‘‘పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు తల్లాడ శ్రీనివాస్‌.  ‘‘సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన యాక్షన్‌ సినిమా ఇది’’ అన్నారు సాయికృష్ణ.

Advertisement
 
Advertisement
Advertisement