‘ఒకే ప్రేమ ఒకే హృదయం ఒకే విధి’

Bellamkonda Sai Sreenivas n pooja hegde look from Saakshyam - Sakshi

జయ జానకీ నాయక సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రకృతిలోని పంచభూతాల ఆధారంగా తెరకెక్కుతుండటం, ఇప్పటికే రిలీజైన కాన్సెప్ట్ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమా మీద హైప్ క్రియేట్ అయ్యింది. దాదాపుగా షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమాలో హీరో హీరోయిన్ల లుక్‌ను ప్రేమికుల రోజు సందర్భంగా రివీల్‌ చేశారు చిత్రయూనిట్‌.

దాదాపుగాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను జనవరి 26నే రిలీజ్‌ చేయాలని భావించినా వాయిదా పడింది. తాజాగా హీరోహీరోయిన్ల లుక్‌ను ఒకేసారి రిలీజ్‌ చేసేందుకు ప్రేమికుల రోజే కరెక్ట్‌ అని భావించిన చిత్రయూనిట్‌ ఈ రోజు (ఫిబ్రవరి 14) ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఒకే ప్రేమ ఒకే హృదయం ఒకే విధి అనే కాన్పెప్ట్ తో రూపొందించిన ఈ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అభిషేక్ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, శరత్ కుమార్, మీనా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top