నటుణ్ణి కాకపోతే నిర్మాత అయ్యేవాణ్ణి! | 'Asura' My Most Commercial Film: Nara Rohit | Sakshi
Sakshi News home page

నటుణ్ణి కాకపోతే నిర్మాత అయ్యేవాణ్ణి!

Jun 5 2015 12:01 AM | Updated on Aug 29 2018 3:53 PM

నటుణ్ణి కాకపోతే నిర్మాత అయ్యేవాణ్ణి! - Sakshi

నటుణ్ణి కాకపోతే నిర్మాత అయ్యేవాణ్ణి!

ఈ సినిమాలో పనిరాక్షసుడైన ధర్మ అనే జైలర్ పాత్రలో నటించాను. వృత్తికి న్యాయం చేయడం కోసం ఎంతకైనా తెగించే పాత్ర ఇది.

‘‘ఈ సినిమాలో పనిరాక్షసుడైన ధర్మ అనే జైలర్ పాత్రలో నటించాను. వృత్తికి న్యాయం చేయడం కోసం ఎంతకైనా తెగించే పాత్ర ఇది. నా నుండి ప్రేక్షకులు ఎలాంటి సినిమా ఆశిస్తారో ఇది అలానే ఉంటుంది’’ అని నారా రోహిత్ అన్నారు.  కృష్ణ విజయ్ దర్శకత్వంలో నారా రోహిత్  హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘అసుర’. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ -‘‘ ‘అసుర’ స్క్రిప్ట్  నాకు బాగా నచ్చింది.
 
 అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. యాక్షన్, థ్రిల్లర్ నేపథ్యంలో ఓ కమర్షియల్ చిత్రానికి కావాల్సిన హంగులన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ఇంటర్వెల్‌కు ముందు 20 నిమిషాలు, క్లైమాక్స్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. నాకు మొదటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఒకవేళ యాక్టర్ కాకపోతే కచ్చితంగా నిర్మాత అయ్యేవాణ్ణి. ఎప్పటినుంచో సినిమాలు నిర్మించాలనుకుంటున్నా. అది ఈ సినిమాతో మొదలైంది’’ అన్నారు. పాత్ర డిమాండ్ చేస్తే, సిక్స్ ప్యాక్ చేయడానికి రెడీ అని రోహిత్ పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement