అర్జున్‌ ముందు ఇక్కడి నుంచి వెళ్లిపో

Arjun Kapoor Trolls Alia Bhatt on Rakhi Pic - Sakshi

అర్జున్‌ కపూర్‌కి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు అలియా కపూర్‌. ఇంతకూ అలియా ఏ విషయం గురించి అర్జున్‌ కపూర్‌కి అంత ఘాటుగా సమాధానం ఇచ్చింది అనుకుంటున్నారా. విషయం ఏంటంటే అలియా పోస్ట్‌ చేసిన ఒక ఫోటో గురించి అర్జున్‌ కపూర్‌ కాస్తా వెటకారంగా కామెంట్‌ చేశాడు. దాంతో అలియా అతనికి ఓ చిన్న సైజు వార్నింగ్‌ ఇచ్చింది. రాఖీ సందర్భంగా అలియా కరణ్‌ జోహర్‌ కుమారుడు యష్‌ జోహర్‌కి రాఖీ కట్టింది. ఈ సందర్భంగా తీసిన ఫోటోని అలియా సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది.

ఎంతో క్యూట్‌గా ఉన్న ఆ ఫోటోను ఇప్పటికే దాదాపు 13 లక్షల మందికి పైగా చూశారు. ఎంతో మంది కామెంట్‌ చేశారు. అలా కామెంట్‌ చేసినవారిలో అర్జున్‌ కపూర్‌ కూడా ఉన్నారు. అలియా పోస్టు చేసిన ఫోటోను ఉద్దేశిస్తూ, అర్జున్‌ కపూర్‌ ‘యశ్‌ నువ్వు చెప్పినంతా ఎగ్జైటెడ్‌గా ఏమి లేడు’ అంటూ కామెంట్‌ చేశాడు. అందుకు అలియా ‘అర్జున్‌ ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో.. తను చాలా బాగా ఆడుకుంటున్నాడు.. విసిగించకు’ అంటూ రిప్లై ఇచ్చింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top