అంజలి రీ ఎంట్రీ షురూ | anjali re entry in tamil films | Sakshi
Sakshi News home page

అంజలి రీ ఎంట్రీ షురూ

Jul 3 2014 1:15 AM | Updated on Sep 2 2017 9:42 AM

అంజలి  రీ ఎంట్రీ షురూ

అంజలి రీ ఎంట్రీ షురూ

‘నా తమిళ రీ ఎంట్రీని ఎవరూ ఆపలేరు’ ఇది నటి అంజలి ప్రకటన. ‘అడ్డుకుని తీరతా. నా చిత్రం పూర్తి చేయ కుండా అంజలిని తమిళంలో ఇతర చిత్రాల్లో నటించనిచ్చే ప్రసక్తే లేదు’ ఇది దర్శకుడు కలైంజియం ప్రకటన

‘నా తమిళ రీ ఎంట్రీని ఎవరూ ఆపలేరు’ ఇది నటి అంజలి ప్రకటన. ‘అడ్డుకుని తీరతా. నా చిత్రం పూర్తి చేయ కుండా అంజలిని తమిళంలో ఇతర చిత్రాల్లో నటించనిచ్చే ప్రసక్తే లేదు’ ఇది దర్శకుడు కలైంజియం ప్రకటన. మరో పక్క అంజలిని కలైంజియం చిత్రాన్ని పూర్తి చేసేలా తమిళ దర్శకుల సంఘం సామరస్య చర్చలు, ఇంకోపక్క తమిళనాడు ఫిలిం, టీవీ నిర్మాతల గిల్డ్ నటి అంజలికి అవకాశాలివ్వద్దని తెలుగు, మలయాళం, కన్నడం నిర్మాత సంఘాలకు లేఖలు రాసింది.

‘నా చిత్రంలో హీరోయిన్ అంజలినే’ ఇది దర్శకుడు సూరజ్ నిర్ణయం. ఇన్ని అనుకూల, ప్రతికూల అంశాల మధ్య నటి అంజలి ఏడాది గ్యాప్ తరువాత కోలీవుడ్‌లో రీ ఎంట్రీకి సిద్ధమైంది. గురువారం జయం రవి హీరోగా నటిస్తున్న చిత్రంలో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు సూరజ్ స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ తన చిత్రంలో హీరోయిన్ పాత్రకు అంజలి సూటబుల్ అన్నారు. చిత్ర కథను వినిపించగానే ఆమె నటించడానికి అంగీకరించారని చెప్పారు. చిత్ర షూటింగ్ గురువారం నుంచి చెన్నైలో జరగనున్నట్లు ఈ షెడ్యూల్‌లో అంజలి పాల్గొననున్నట్లు దర్శకుడు సూరజ్ వెల్లడించారు. ఈ వ్యవహారం కోలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement