‘అల్లరి’ నరేశ్‌కు ప్రమోషన్ | Allari Naresh Blessed With Baby Girl | Sakshi
Sakshi News home page

‘అల్లరి’ నరేశ్‌కు ప్రమోషన్

Sep 29 2016 12:06 AM | Updated on Sep 4 2017 3:24 PM

‘అల్లరి’ నరేశ్‌కు ప్రమోషన్

‘అల్లరి’ నరేశ్‌కు ప్రమోషన్

వెండితెరపై తన అల్లరితో థియేటర్‌లో ప్రేక్షకులకు నవ్వులు పంచుతున్న ‘అల్లరి’ నరేశ్ ఇల్లంతా చిన్నారి నవ్వులతో సందడిగా మారింది.

వెండితెరపై తన అల్లరితో థియేటర్‌లో ప్రేక్షకులకు నవ్వులు పంచుతున్న ‘అల్లరి’ నరేశ్ ఇల్లంతా చిన్నారి నవ్వులతో సందడిగా మారింది. నిజ జీవితంలో నరేశ్‌కి తండ్రిగా ప్రమోషన్ లభించింది. నరేశ్ భార్య విరూపా కంఠమనేని బుధవారం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ‘‘చాలా సంతోషంగా ఉంది. అందమైన చిన్నారి పాపకు తండ్రి అయిన అదృష్టవంతుడిని’’ అంటూ ‘అల్లరి’ నరేశ్ తన ఆనందాన్ని పంచుకున్నారు. చిట్టి చిన్నారితో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గత ఏడాది మే నెలలో నరేశ్, విరూపల వివాహం జరిగింది.
 

Advertisement
 
Advertisement
Advertisement