విడుదలకు సిద్ధమైన ‘అక్షర’ | Akshara Movie Ready To Release On October | Sakshi
Sakshi News home page

విడుదలకు సిద్ధమైన ‘అక్షర’

Sep 5 2019 9:15 PM | Updated on Sep 5 2019 9:22 PM

Akshara Movie Ready To Release On October - Sakshi

హీరోయిన్‌ నందిత శ్వేత నటిస్తోన్న తాజా చిత్రం అక్షర. ఈ సినిమాను అల్లూరి వర్మ, అహితేజ బెల్లంకొండలు నిర్మిస్తున్నారు. అక్షర సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో చిత్ర యూనిట్‌ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నిర్మాతలు మాట్లాడుతూ..విద్యావ్వవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ చక్కని పరిష్కారాన్నిచ్చేలా ఈ కథను రూపోంచమన్నారు. ఈ సినిమాలో నందిత శ్వేత పాత్ర ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుందని, కమర్షీయల్‌ ఎలిమెంట్స్‌ తగ్గకుండా అద్భుతమైన మెసేజ్‌తో  ఈ సినిమాని అక్టోబర్‌ రెండోవారంలో విడుదల చేస్తున్నాట్లు తెలిపారు. అక్షర షూటింగ్‌ పూర్తి అయిందని, ఇంకా పోస్ట్‌ ప్రోడక్షన్‌ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయని అన్నారు. ఇప్పటికే విడుదల చేసిన అక్షర టీజర్‌, పాటలకు మంచి స్పందన వచ్చిందని దీంతో సినిమాపై మా నమ్మకం మరింత రెట్టింపు అయింది, సినిమా కూడా ప్రతి ఒక్కరిని ఖచ్చితం అలరిస్తుందని మేము నమ్ముతున్నామని అన్నారు.  

అలాగే ఈ సినిమా దర్శకుడు బి. చిన్నికృష్ట మాట్లాడుతూ..ఈ సినిమా అవుట్‌ పట్‌పై మాకు పూర్తి సతృప్తిగా ఉందని, సినిమా చాలా బాగా వచ్చిందని తెలిపాడు. అక్షర లాంటి కథలు అరుదుగా వస్తాయని ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపాడు. అక్టోబర్‌ రెండవ వారంలో విడుదల కానున్న మా అక్షర సినిమా మీ అందరికి నచ్చుతుందని అశిస్తున్నాను అన్నాడు. నందిత శ్వేత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సత్య, మధునందన్‌, షకలక శంకర్‌, శ్రీ తేజ తదితరులు నటిస్తున్నాట్లు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement