కూతురి కోసం చెవులు కుట్టించుకున్న హీరో | Abhishek Bachchan pierced his ears for daughter Aaradhya | Sakshi
Sakshi News home page

కూతురి కోసం చెవులు కుట్టించుకున్న హీరో

Sep 16 2017 12:20 PM | Updated on Sep 19 2017 4:39 PM

కూతురి కోసం చెవులు కుట్టించుకున్న హీరో

కూతురి కోసం చెవులు కుట్టించుకున్న హీరో

కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన సందడి చేశారు.

కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన సందడి చేశారు. గూంజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అన్షు గుప్తాకు మద్ధతుగా అభిషేక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే సరదాగా సాగిన ఈ కార్యక్రమంలో అమితాబ్, అభిషేక్ లు కాసేపు తమ స్థానాలు మార్చుకోనున్నారు. అభిషేక్ బచ్చన్ వ్యాఖ్యతగా మారి ప్రశ్నలు సందిస్తుంటే బిగ్ బి హాట్ సీట్లో కూర్చోని సమాధానాలు ఇచ్చారు.

అంతేకాదు ఈ సందర్భంగా అభిషేక్ తన కూతురు ఆరాధ్యకు చెవులు కుట్టించే సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి వెల్లడించారు. ఆరాధ్యకు చెవులు కుట్టించే సమయంలో అభిషేక్ ముందుగా తన చెవులు కుట్టించుకున్నారట. తన గారల పట్టికి ఎంత నొప్పి కలుగుతుందో తెలుసుకునేందుకు అభిషేక్ ఇలా చేశారట. ఈ విషయాన్ని అభిషేక్ స్వయంగా వెల్లడించారు. శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్ లో అన్షుతో కలిసి అభిషేక్ 25 లక్షల రూపాయలు గెలుచుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement