సెకనుకు 12 టికెట్లు బుక్! | 12 tickets booked each second for baahubali on book my show | Sakshi
Sakshi News home page

సెకనుకు 12 టికెట్లు బుక్!

May 3 2017 11:49 AM | Updated on Sep 5 2017 10:19 AM

సెకనుకు 12 టికెట్లు బుక్!

సెకనుకు 12 టికెట్లు బుక్!

బాహుబలి-2 సినిమా అన్ని రకాల రికార్డులను బద్దలుకొడుతోంది. తాజాగా ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫాం బుక్ మై షో కూడా ఈ విషయం ప్రకటించింది.

బాహుబలి-2 సినిమా అన్ని రకాల రికార్డులను బద్దలుకొడుతోంది. తాజాగా ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫాం బుక్ మై షో కూడా ఈ విషయం ప్రకటించింది. ఇప్పటివరకు తాము దాదాపు 33 లక్షల టికెట్లు అమ్మినట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రతి సెకనుకు 12 టికెట్లు బుక్ అవుతున్నాయని, దాంతో ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. బాహుబలి మొదటి పార్ట్ కంటే రెండో భాగానికి 350 శాతం ఎక్కువగా అడ్వాన్స్ టికెట్ల అమ్మకాలు జరిగినట్లు ప్రకటించింది.

కేవలం దక్షిణ భారతంలోనే కాక, దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా టికెట్ల అమ్మకాల జోరు ఏమాత్రం తగ్గలేదని, దాంతో ఇది భారతీయ సినీ పరిశ్రమను ఆశ్చర్యంలో ముంచెత్తిందని బుక్ మై షోకు చెందిన ఆశిష్ సక్సేనా అన్నారు. విడుదలకు ముందే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొదటిరోజే వందకోట్ల క్లబ్బులో చేరిపోయిందన్నారు. భాషా భేదాల సంకెళ్లను కూడా ఈ సినిమా తెంచుకుందని, సినిమా బాగుంటే ఎక్కడైనా ఎవరైనా చూస్తారన్న విషయం మరోసారి రుజువైందని ఆయన చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement