గార్లిక్‌ ఫెస్టివల్‌లో కాల్పులు, ముగ్గురు మృతి | Police Confirm Casualties In California Shooting | Sakshi
Sakshi News home page

కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం

Jul 29 2019 9:20 AM | Updated on Jul 29 2019 9:57 AM

Police Confirm Casualties In California Shooting   - Sakshi

కాల్పుల కలకలంతో ఫుడ్‌ ఫెస్టివల్‌ నుంచి బయటపడుతున్న సందర్శకులు

కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం

న్యూయార్క్‌ : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కాలిఫోర్నియాలో ఓ ఫుడ్‌ ఫెస్టివల్‌ సాగుతుండగా అక్కడ గుమికూడిన వారిపై విరుచుకుపడిన ఆగంతకుడు విచక్షణారహితంగా కాల్పులకు దిగాడు. మూడు రోజుల గిల్‌రే గార్లిక్‌ ఫెస్టివల్‌ చివరి రోజున ఈ ఘటన జరిగింది. దుండగుడి కాల్పుల్లో ముగ్గురు మరణించారు. ఈ ఘటనలో 16 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.

కాల్పుల ఘటనతో ఫుడ్‌ ఫెస్టివల్‌కు హాజరైన వారు భయంతో ఆ ప్రాంతం నుంచి పరుగులు తీశారు. కాల్పుల శబ్ధాలతో ఉలిక్కిపడిన సందర్శకులు తొలుత బాణాసంచా పేలుళ్లుగా భావించామని ప్రత్యక్ష సాక్షుల్లో కొందరు చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద సమ్మర్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌గా పేరొందిన గిల్‌రే ఫుడ్‌ ఫెస్టివల్‌పై దాడి ఆందోళనకరమని అధికారులు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement