ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా మేక్రన్‌!: ఎగ్జిట్‌ పోల్స్‌ | Immanuel Macron as President of France : Exit polls | Sakshi
Sakshi News home page

ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా మేక్రన్‌!: ఎగ్జిట్‌ పోల్స్‌

May 8 2017 12:45 AM | Updated on Sep 5 2017 10:38 AM

ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా మేక్రన్‌!: ఎగ్జిట్‌ పోల్స్‌

ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా మేక్రన్‌!: ఎగ్జిట్‌ పోల్స్‌

ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా ఇమ్మాన్యుయేల్‌ మేక్రన్‌ ఎన్నిక లాంఛనమేనని ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు తేల్చిచెప్పాయి.

పారిస్‌: ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా ఇమ్మాన్యుయేల్‌ మేక్రన్‌ ఎన్నిక లాంఛనమేనని ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు తేల్చిచెప్పాయి. ఆదివారం జరిగిన రెండో రౌండ్‌ పోలింగ్‌లో మేక్రన్, మరీన్‌ లీ పెన్‌లు అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. పోలైన ఓట్లలో 50 శాతానికి పైగా సాధించిన వారిని అధ్యక్ష పదవి వరించనుంది. మాక్రన్‌కు 65.5 శాతం, లీ పెన్‌కు 34.5 శాతం ఓట్లు పోలవుతాయని మెజార్టీ సర్వేలు స్పష్టం చేశాయి.

మొదటి దశ ఎన్నికల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన మేక్రన్, మరీన్‌ లీ పెన్‌లు రెండో రౌండ్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు యూరప్‌ భవిష్యత్తుకు అత్యంత కీలకం కావడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement