మలేరియా దోమకే మలేరియా వస్తే.. | Genetically modified mosquitoes offer hope in malaria fight | Sakshi
Sakshi News home page

మలేరియా దోమకే మలేరియా వస్తే..

Jun 11 2014 1:02 AM | Updated on Sep 2 2017 8:35 AM

మలేరియా దోమకే మలేరియా వస్తే..

మలేరియా దోమకే మలేరియా వస్తే..

మనుషులను కుట్టి కుట్టి చంపే దోమలు అంటువ్యాధులతో చస్తే.. కసితీరుతుంది కదూ! ఇది ఊహ కాదు. నిజంగానే దోమలకు కూడా అంటువ్యాధులు వస్తాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

మనుషులను కుట్టి కుట్టి చంపే దోమలు అంటువ్యాధులతో చస్తే.. కసితీరుతుంది కదూ! ఇది ఊహ కాదు. నిజంగానే దోమలకు కూడా అంటువ్యాధులు వస్తాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దోమలలో అంటు వ్యాధులను పెంపొందిస్తే మలేరియాను వ్యాప్తి చేసే అనాఫిలిస్ దోమల్ని అంతమొందించడం ఎంతో ఈజీ అంటున్నారు. అనాఫిలిస్ దోమల్లోని రెండు రకాల జాతుల్లో అంటువ్యాధుల్ని కలిగించే కణాంతర్గత బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిని వల్బాచియా అని పిలుస్తున్నారు. దీనితో మలేరియాను వ్యాప్తి చేసే దోమల్ని అంతమొందించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ‘‘వల్బాచియా ఒక ఆసక్తికరమైన బ్యాక్టీరియా. దీనిని గుర్తించినపుడు మేమెంతో థ్రిల్లయ్యాం. దోమల్ని నియంత్రించడానికి ఇది సరిగ్గా సరిపోతుంది’’ అని హార్వార్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన ప్లమీనియా చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement