వాటిపై నిషేధం బాగా కలిసొచ్చింది! | Sakshi
Sakshi News home page

వాటిపై నిషేధం బాగా కలిసొచ్చింది!

Published Wed, Aug 24 2016 5:27 PM

వాటిపై నిషేధం బాగా కలిసొచ్చింది!

ఆస్ట్రేలియాకు చెందిన ముస్లిం స్విమ్ సూట్ డిజైనర్ చాలా సంతోషంగా ఉన్నారు. అందుకు కారణం అడిగితే తాను రూపొందించిన స్విమ్ సూట్లపై మూడు ఫ్రెంచ్ నగరాలలో నిషేధం విధించడమే కలిసొచ్చిందని గర్వంగా చెబుతోంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. సాధారణంగా ముస్లిం మహిళలు, యువతులు 'బురఖా' ధరించడం చూస్తుంటాం. అయితే ఈత కొలనులో దిగాలంటే పొట్టి పొట్టి స్విమ్ సూట్లు ధరించాల్సి ఉంటుంది.

ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన ముస్లిం స్విమ్ సూట్ డిజైనర్ అహెదా జనేతి ముస్లిం యువతులు ఈతకొలనులో దిగాలంటే ప్రత్యేక స్విమ్ సూట్ అవసరమని భావించింది. బురఖా తరహాలో ఉండే ఈత డ్రెస్సులను ఆమె డిజైన్ చేస్తోంది.  గత వారం కేన్స్, విలిన్వే-లోబెట్, కొర్సికా తీరంలోని సిస్కోలో ఈ తరహా స్విమ్మింగ్ డ్రెస్సులను నిషేధించారు. అయితే ఆశ్చర్యకరంగా అప్పటినుంచీ తాను డిజైన్ చేస్తున్న స్విమ్ సూట్లకు బాగా డిమాండ్ రావడంతో అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు డిజైనర్ అహెదా జనేతి వెల్లడించారు.

దాదాపు ఆరేళ్ల కిందట ఫ్రాన్స్ లో కొన్ని ప్రాంతాల్లో బురఖా ధరించడంపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. నిషేధం విధించిన తర్వాత తన ఉత్పత్తులలో 40 శాతం స్విమ్ సూట్లు ముస్లిమేతర యువతులు, మహిళలు కొనుగోలు చేస్తున్నారని దాంతో మరిన్ని లాభాలు వస్తున్నాయని మీడియాకు వివరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement