సోలోమన్ దీవుల్లో భూకంపం | 6.6-magnitude quake hits 180km Dadali, Solomon Islands | Sakshi
Sakshi News home page

సోలోమన్ దీవుల్లో భూకంపం

Aug 11 2015 8:26 AM | Updated on Sep 3 2017 7:14 AM

సోలోమన్ దీవుల్లో భూకంపం సంభవించింది.

హొనియారా: సోలోమన్ దీవుల్లో సోమవారం సాయంత్రం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.6గా నమోదు అయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సునామీ వచ్చే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. దాడ్లీలోని నైరుతి ప్రాంతంలో 180కిలోమీటర్ల మేర భూమి కంపించిందని తెలిపారు.

దాడ్లిలో భూమికి 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది.  ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు సమాచారం లేదని యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement