తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం | rain information in hyderabad | Sakshi
Sakshi News home page

తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం

Sep 9 2015 3:42 PM | Updated on Sep 4 2018 5:16 PM

తెలంగాణలో విస్తారంగా వర్షాలు, వరుసగా మూడురోజుల పాటు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం బుధవారం వెల్లడించింది.

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో బుధవారం భారీ వర్షం కురిసింది. తెలంగాణలో వరుసగా మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం బుధవారం వెల్లడించింది. హైదరాబాద్ క్యుములోనింబస్ మేఘాలు ఆవరించి ఉండటంతో మధ్యాహ్నం నుంచి వాతావరణంలో మార్పులు సంభవించి వర్షాలు కురిశాయి.

ఉరుములు, మెరుపులతో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే కురిసిన వర్షపాతం కాకుండా.. హైదరాబాద్లో గరిష్టంగా 5 సెంటీ మీటర్ల వర్షపాతం.. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఇవే వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ విభాగం తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement