విభిన్నం...వినూత్నం | fashion show in tajdeccan | Sakshi
Sakshi News home page

విభిన్నం...వినూత్నం

Feb 28 2016 2:16 AM | Updated on Sep 3 2017 6:33 PM

విభిన్నం...వినూత్నం

విభిన్నం...వినూత్నం

తాజ్ డెక్కన్‌లో శనివారం ఫ్యాషన్ షో నిర్వహించారు. విభిన్న రకాల దుస్తులతో మోడల్స్ హొయలొలికించారు.

తాజ్ డెక్కన్‌లో శనివారం ఫ్యాషన్ షో నిర్వహించారు.
విభిన్న రకాల దుస్తులతో మోడల్స్ హొయలొలికించారు.

నగరంలో తొలిసారి నిర్వహించిన ఇంటర్నేషనల్ గ్లామ్ ఫ్యాషన్ వీక్ బ్రాండ్ ఫ్యాషన్ ఈవెంట్ ఆకట్టుకుంది. బెంగళూరుకు చెందిన ఈ బ్రాండ్ ఆధ్వర్యంలో నగరంలో రెండురోజుల ఈ కార్యక్రమం శనివారం తాజ్‌డెక్కన్‌లో ప్రారంభమైంది. తొలిరోజు లక్నోకు చెందిన డిజైనర్ హర్షిజమాల్, ముంబయికి చెందిన  సంతోష్, హైదరాబాద్‌కి చెందిన నాగరాజు, అమిన్ ఫరిష్టా తదితర 10 మంది డిజైనర్ల దుస్తులను మోడల్స్ ప్రదర్శించారు. డిజైనర్లు తమ కలెక్షన్లలో స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్స్‌కు ఎక్కువగా చోటు కల్పించారు. - సాక్షి, సిటీబ్యూరో

Advertisement
 
Advertisement
Advertisement