మాకు రెండు చెవుల నారాయణ కావాలి | CM kcr Comments On CPI Narayana his comments | Sakshi
Sakshi News home page

మాకు రెండు చెవుల నారాయణ కావాలి

Feb 5 2016 8:12 PM | Updated on Aug 15 2018 9:30 PM

మాకు రెండు చెవుల నారాయణ కావాలి - Sakshi

మాకు రెండు చెవుల నారాయణ కావాలి

'నాకు సీపీఐ నారాయణ మంచి మిత్రుడు. ఆయనను ఒక్క చెవితో చూడటం నాకు ఇష్టం లేదు. ఆయన చెవి జోలికి ఎవరూ పోవద్దు.

హైదరాబాద్ : 'నాకు సీపీఐ నారాయణ మంచి మిత్రుడు. ఆయనను ఒక్క చెవితో చూడటం నాకు ఇష్టం లేదు. ఆయన చెవి జోలికి ఎవరూ పోవద్దు. పార్టీ నేతలతో పాటు మీడియా మిత్రులకు కూడా చెబుతున్నా' అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాగా గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వంద సీట్లు వస్తే చెవి కోసుకుంటానని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. దీనిపై కేసీఆర్ పైవిధంగా స్పందించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై కేసీఆర్ శుక్రవారం తెలంగాణ భవన్లో ప్రెస్మీట్లో మాట్లాడారు.

 

నారాయణ జోలికి ఎవరూ పోవద్దని, తమకు రెండు చెవుల నారాయణ కావాలంటూ ఛలోక్తులు విసిరారు. నారాయణ తనకంటే కేశవరావుకు మరింత మంచి మిత్రుడని, ఆ విషయాన్ని కూడా నాయకులు, కార్యకర్తలు గుర్తుంచుకోవాలని కేసీఆర్ అన్నారు. ఎన్నికల వరకు ప్రతిపక్షాలు ఎలా మాట్లాడినా... ఇకపై మాత్రం నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement